Link copied!
Sign in / Sign up
0
Shares

మీ ముఖానికి ఎప్పుడు తగలకూడని 5 వస్తువులు : చాలా ప్రమాదం


మీ శరీరంలో అందరూ ఎక్కువగా గమనించేది మీ ముఖాన్ని. అది అందంగా, కాంతివంతంగా ఉండాలని మీరు కోరుకుంటారు. అందుకు చేయాల్సిన వన్ని చేస్తారు. రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు వాడుతారు. వీటితో పాటు ముఖాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. అంటే మీ ముఖానికి కొన్ని వస్తువులను దూరంగా ఉంచాలి. అవి మీ ముఖానికి అంత మంచివి కావు. మీ ముఖానికి దూరంగా ఉంచాల్సిన ఆ వస్తువులేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. షాంపూ

మీ ముఖం, మీ జుట్టు భిన్నమైన నిర్మాణాన్ని కలిగివుంటాయి. అలాగే వాటి సున్నితత్వం కూడా వేరు. వాటిని క్లీన్ చేసే పద్దతి వేరు. క్లీన్ చేయడానికి వాడాల్సినవి వేరు. అందుకే జుట్టు ను శుభ్రం చేయడానికి వాడే షాంపూ చాలా గాఢంగా ఉంటుంది. దీనిని సున్నితంగా ఉండే ముఖానికి వాడడం మంచిది కాదు.

2. హెయిర్ కలర్

జుట్టు నల్లగా కనపడడానికి వాడే హెయిర్ కలర్ లో అనేకమైన కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని జుట్టుకు పెట్టుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని మీ ముఖానికి తగలనివ్వకుండా చూసుకోండి.

3. స్ప్రే

మీరు శరీరానికి వాడే స్ప్రే లో చాలా ఘాటైన వాసన రావడనికి కొన్ని రకాల కెమికల్స్ వాడుతారు. దీనిని మీరు ఎట్టి పరిస్థితులలోను ముఖం మీద పడకుండా చూసుకోండి. ఒక వేళ పడినా వెంటనే ముఖం నీటితో కడుక్కోండి. లేకపోతే ముఖం మీద మంట, ర్యాషెస్ వస్తాయి.

4. బాడీ లోషన్

మీ శరీరాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచడానికి మీరు బాడీ లోషన్ వాడుతారు. వాడడం మంచిది కూడా. కానీ మీ శరీరానికి మేలు చేసే బాడీ లోషన్, మీ ముఖానికి మంచిది కాదు. శరీరానికి వాడే బాడీ లోషన్ ను మీ ముఖానికి ఎప్పుడు వాడకండి. ముఖం మృదుత్వాన్ని కోల్పోతుంది.

5. వెనిగర్

 

 

 

ఏదైనా ఫేసియల్స్ లో మీరు వెనిగర్ ను వాడుతున్నారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెనిగర్ ను ఫేసియల్ కు ముందు టోనర్ గా వాడడం చాలా మంది చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ రోజులు నిలువ ఉన్న వెనిగర్ చాలా ఘాటుగా మారిపోతుంది. దానిని వాడడం వలన ముఖం మీద మంట పుడుతుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon