Link copied!
Sign in / Sign up
4
Shares

మీ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పూర్తిగా ఎదగకుండా తక్కువ బరువుతో పుట్టడానికి కారణాలు ఇవే

ప్రేగ్నన్ట్ అయిన ప్రతి మహిళ ఒక తల్లిగా కోరుకునేది తన బిడ్డ పూర్తిగా ఎదిగి ఆరోగ్యంగా పుట్టాలని. అందుకు తగినట్టుగా పోషకవిలువలతో కూడిన ఆహరం, ప్రతి చిన్న విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రతిఒక్కరు చేస్తారు. కానీ కొన్ని కారణాల వలన మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పిల్లలు పూర్తిగా ఎదగకుండా తక్కువ బరువుతో పుడుతారు. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి…

కడుపులోని బిడ్డ నిదానంగా లేదా పూర్తిగా ఎదగక పోవడానికి ఇంట్రూటెరిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ - Intrauterine Growth Restriction (IUGR) అంటారు.

1. ప్రీఎక్లాంప్సియా (Preeclampsia)

ప్రెగ్నన్సీ సమయంలో రక్త పోటు అధికంగా ఉండడాన్ని ప్రీఎక్లాంప్సియా అంటారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టపోవడానికి ఇది ఒక కారణం. అధిక రక్తపోటు మీ రక్తనాళాలను కుదింపచేస్తుంది. దీని మూలంగా కడుపులోని బిడ్డకు సరైన రక్తం అందదు. ఎదుగుదల పూర్తిగా జరగదు. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో అధిక రక్తపోటు రాకుండా జాగ్రత్త తీసుకోండి. తరుచు రక్త పోటును చెక్ చేయించుకోండి.

2. కవలలు

మీరు కవలలతో ప్రేగ్నన్ట్ అయినప్పుడు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడానికి, పూర్తిగా ఎదగకపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ ద్వారా అందే పోషకాలు ఇద్దరి బిడ్డలకు సరిపోకపోవడం దీనికి కారణం. కడుపులో ఉన్న కవలలకు సమానమైన పోషకాలు అందకపోతే, ఒక బిడ్డ లేదా ఇద్దరు తక్కువ బరువుతో పుట్టచ్చు. మీకు కవలలు పుట్టబోతున్నారని తెలిస్తే తీసునే ఆహారంలో రెండింతల జాగ్రత్త తీసుకోండి.

3. ఇన్ఫెక్షన్లు

ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఏదైనా ఇంఫెక్షన్లు ఉంటే, అవి మీ నుండి కడుపులోని బిడ్డకు చేరుతాయి. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు కడుపులోని బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. బిడ్డకు అందాల్సిన పోషకాలను అందకుండా చేస్తాయి. ఎదుగుదలను సరిగా జరగదు.

4. ప్లాసెంటా పనిచేయకపోవడం

ప్లాసెంటా (జరాయువు) మీ గర్భసంచిలో ఉండే ఒక అవయువం. ఇది కడుపులోని బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్ ను, పోషకాలను అందిస్తుంది. ఈ ప్లాసెంటా సరిగా పనిచేయకపోవడం వలన బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. ఎదుగుదల మందగిస్తుంది.

5. బొడ్డు తాడు లోపాలు 

ప్లాసెంటాకు బిడ్డకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది, బొడ్డు తాడు. దీని ద్వారానే బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన, రక్తం, ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. బొడ్డు తాడులో లోపాలు లేదా ఏదైనా సమస్యలున్నప్పుడు బిడ్డకు సరైన పోషకాలు అందవు. ఫలితంగా ఎదుగుదల ఉండదు.

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తరచుగా చెక్ అప్స్ చేయించుకోండి. ఈ సమస్యలన్నింటికి దూరంగా ఉండండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon