Link copied!
Sign in / Sign up
11
Shares

మీ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలిపే 6 గుర్తులు : ఇంట్లో మీరే తెలుసుకోవచ్చు

కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా, లేదా ప్రతి తల్లీ తెలుసుకోవాలనుకుంటుంది. మీ గర్భంలోని శిశువు చాలా సున్నితమైనది మరియు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండటం వలన బలహీనపడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే కడుపులోని బిడ్డను చూడలేకపోవడం వలన ఆ సమస్యలను గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఇక్కడ చెప్పుకునే ఈ గుర్తుల కారణంగా మీ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు..

హార్ట్ బీట్ లేకపోవడం

మీ బిడ్డ ఆరోగ్యస్థితిని బిడ్డ హార్ట్ బీట్ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. డోప్లర్ టెస్ట్ ద్వారా డాక్టర్లు చెబుతారు. సాధారణంగా 10 వ వారంలో హార్ట్ బీట్ తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు 5 వ వారంలో హార్ట్ బీట్ మొదలలవుతుంది. మీ చుట్టూ ఉన్న ఒత్తిడి,, ఆందోళనల కారణంగా మరియు పరిసరాల కారణంగా హార్ట్ బీట్ మొదలవుతుంది.

తిమ్మిర్లు

గర్భంతో ఉన్నప్పుడు తిమ్మిర్లు రావడం సహజమే. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా ఈ విధంగా అవుతూ ఉంటాయి. అప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువగా తిమ్మిర్లు అవుతూ ఉండటం జరుగుతుంటే అధిక మోతాదులో రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. రెండవ,  మూడవ నెలలలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది మీ బిడ్డ త్వరగా బయటకు రాబోతున్నాడు అనే తెలిపే సూచిక కూడా..

రక్తస్రావం

ప్రగ్నన్సీ సమయంలో యోని నుండి వచ్చే రక్తస్రావం కడుపులోని బిడ్డకు మీకు అంత ఆరోగ్యకరం కాదని అంటున్నారు. గర్భం పోతుంది  అని చెప్పడం కాదు కానీ మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ విధంగా జరగవచ్చు. అలాగే బిడ్డ తల్లి గర్భం నుండి నెలలు నిండకుండానే వచ్చే అవకాశం ఉంది.

నడుం నొప్పి

గర్భంతో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉండటమే సహజమే..ఎందుకంటే ముందు భాగంలో మీతో పాటు మీ బిడ్డను మీరు మోస్తూ ఉండటం వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఐతే ఎక్కువసార్లు అధికంగా నొప్పి ఉండటం, భరించలేని విధంగా ఉంటే మీ కిడ్నీ లో లేదా బ్లాడర్ ఇన్ఫెక్షన్ కారణంగా గుర్తించాలి.

మహిళల నుండి విడుదలయ్యే స్రావాలు

గర్భంతో ఉన్న మహిళ నుండి విడుదలయ్యే స్రావాలు (రక్తం లేదా మూత్రం) ఎక్కువగా వాసన వస్తూ ఉండటం, రంగులో మార్పులు మీ బిడ్డ ఆరోగ్యాన్ని తెలుపుతాయి. అంటే మీరు సమయానికి సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలన మరియు మీ అనారోగ్యం కారణంగా ఈ విధంగా జరుగుతుంది అని గుర్తించాలి.

బిడ్డ కదలకపోతే..

మీ కడుపులోని బిడ్డ మాములుగా 20 వారాల పరిధిలో తన్నడం మొదలుపెడతాడు. రోజులో కనీసం రెండు గంటలకు ఒకసారి పది సార్లైనా తన్నటం చేస్తుంటారు. ఇలా జరుగుతుంది అంటే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం.

మీ బిడ్డ గురించి మీకు చెప్పి భయపెట్టాలని కాదు, మీరు ముందే గ్రహించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఈ సమాచారం మీకు అందిస్తున్నాం..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon