Link copied!
Sign in / Sign up
56
Shares

రాశి ప్రకారం మీ భర్తకు ఈ వ్యసనం ఉండే అవకాశం ఉంది..! వెంటనే మీ భర్త రాశిని బట్టి చెక్ చేసుకోండి

మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన ఆలోచనలు, ఇష్టా అయిష్టాలు ఉండటం సహజమే. చదవడం, ఇతరులతో మాట్లాడటం, షాపింగ్ చేయడం, కోరికలు కలగడం, బయటి ప్రదేశాలకు వెళ్లి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సరదాగా గడపడం. ఇవి కాస్తా ఎక్కువయితే, ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ ఉంటే వ్యసనాలు అని అంటారు. సాధారణంగా ఎప్పుడు తాగేవాళ్లను, పేకాట ఆడుతూ పని పాట లేకుండా తిరిగేవాళ్ళను వ్యసనాలకు  అలవాటు పడ్డారు అని అంటుంటారు. అవి మాత్రమే కాదు, రాశి ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో వ్యసనం ఉంటుందట. మరి మీ రాశి ప్రకారం మీరూ చెక్ చేసుకోండి..

మేష రాశి

మేష రాశి ప్రకారం వారికి నచ్చిన లేదా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా గెలికితే శివుడికి కోపం వస్తే మూడు కన్ను తెరచినట్లుగా కోపం వస్తుంది. ఈ కోపంలో ఏదో  ఒకటి చేయకపోతే వీరి మనస్సు కుదుటపడదు. ఉదాహరణకు ఇష్టమైన డ్రింక్ తాగడం లేదా ఒంటరిగా ఎవ్వరూ లేని ప్రదేశాలకు వెళ్లిపోవడం చేస్తుంటారు. అలాగే ఎప్పుడు ఫోన్ పట్టుకుని చాట్ చేస్తూ ఉండటం లేదా ఏదో సర్చ్ చేస్తూ ఉండటం వీరి వ్యసనం.

వృషభ రాశి

కలర్ బాగున్నా, ప్రత్యేకంగా ఉన్నా సరే వెంటనే ఆ వస్తువును కొనాలనుకోవడం వీరి వ్యసనం. డబ్బుల గురించి ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. కుటుంబమే వీరి బలం మరియు వీరి వ్యసనం కూడా. ఎందుకంటే తమ కుటుంబం ఏదైనా ఇబ్బందులో ఉంటే వెంటనే తమకు తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది.

మిధున రాశి

సాహసమైన పనులు చేయడం, ఇతరులపై కామెడీ చేస్తూ నవ్వుకోవడం వీరి వ్యసనం. ఫ్రెండ్స్ వీరి పక్కన ఉంటే చాలు అస్సలు మరో ప్రపంచం వీరికి కనిపించదు. ఒక విషయం అందరూ వంద శాతం వీరు మాత్రం రెండువందల శాతం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టం చూపిస్తూ, అత్యుత్సాహంగా ఉంటారు.

కర్కాటకము

ఈ రాశి వారు ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. తప్పు ఏంటి అని ఆలోచించకుండా నన్ను తిట్టాడు, నా గురించి ఎందుకిలా మాట్లాడారు అనే దానికే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే వయస్సు పెరుగుతున్నా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు.

సింహ రాశి

ఈ రాశి వారికి అందరి నమ్మకం మాములుగా ఉంటే వీరికి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది (ఓవర్ కాన్ఫిడెన్స్). అంటే నేనే కింగ్ , నేనే క్వీన్ అని ఫీలవుతూ ఉంటారు. అది వారి వ్యక్తిగత విషయం, కానీ ఇతరుల ముందు ఇలా చేయడం వలన వీరికి పొగరు, గర్వం ఎక్కువని అనుకుంటారు. ఇదే సింహరాశి వారి వ్యసనం.

కన్య రాశి

కన్య రాశి ప్రకారం ఎదుటివాళ్ళు తమ గురించి ఏమీ అనుకోకపోయినా వీళ్లంతట వీళ్ళే ఊహించేసుకుని భ్రమ పడిపోతూ ఉంటారు. నన్ను వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు కదా అని వేరే వాళ్ళని అడగటం, వాళ్లలో వాళ్ళే బాధపడటం చేస్తుంటారు. నీ గురించి కాదని నిజం చెప్పినా సరే ఆ క్షణాన వరకు బాగుండి, మళ్ళీ మామూలు వ్యక్తులయిపోతారు. ఐతే వీళ్ళే కాకుండా తమ చుట్టూ ఉన్న వాటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు.

తుల రాశి

నేను బాగున్నానా లేదా అనేదే ఈ రాశి వారికి ముఖ్యం, పక్కవాళ్ళు ఎలా ఉంటే నాకేం అని అనుకుంటారు. డబ్బులు పొదుపు చేసుకోవాలనుకుంటారు, కానీ నెల అయ్యేసరికి ఏదో రకంగా అప్పులు చేయడం లేదా అతిగా ఖర్చు చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే తమ ఇష్టాలను చంపుకోలేరు. ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే వీరి వ్యక్తిత్వం.

వృశ్చికం

వీరిలో ఉన్న వ్యసనం, వీక్ నెస్ ఏంటంటే అందరితోనూ త్వరగా కలిసిపోలేరు. అందరిముందు మాట్లాడాలనుకున్నా సరే వారి దగ్గరికి వచ్చేసరికి సైలెంట్ గా ఉండిపోతారు. ఎప్పుడు ఎవరి టీ, కాఫీ తాగుతారా అని అడిగితే వెంటనే ఎస్ అనే సమాధానం ఇస్తారు. ఇది వీరికి ఉన్న మరో వ్యసనం.

ధనస్సు

ఈ రాశి ప్రకారం కోరికలు బాగా ఎక్కువట. శృంగారం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారట. తమకు నచ్చిన వ్యక్తి (అబ్బాయి/అమ్మాయి) తో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. ఒక్క క్షణం వారికి దూరమైనా సరే కొన్ని గంటలుగా ఫీలవుతూ ఉంటారు. తనతో నమ్మకంగా ఉండి మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు.

మకర రాశి

ఇందాక పైన చెప్పుకున్నాం కదా పేకాట, ఎప్పుడు మద్యం సేవించాలనుకోవడం, మత్తులో ఉండటం, పందెలు కాయడం..ఇలా వీరికున్న వ్యసనం. వీటి నుండి బయటపడాలని చూస్తారు కానీ ఎందుకో త్వరగా అక్కడి నుండి రాలేరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనుకోవడం, వాటి మీదకే మనస్సు లాగుతూ ఉంటుంది కాబట్టి. అందుకే నెమ్మదిగా ఎలాగైనా సరే వీటినుండి బయటపడాలి.

కుంభ రాశి

వీళ్ళు ఎంత కష్టపడతారంటే కష్టం కూడా వీరిని చూసి బాధపడుతుంది. కష్టపడుతున్నా కూడా సరైన ఆచరణలో ఆ పనిని పెట్టుకోలేకపోవడం, స్మార్ట్ గా ఆలోచించకుండా కష్టపడాలి అనే ఒకే ఒక్క సూత్రంపై ఆధారపడి పనిచేస్తూ ఉండటం వీరి శరీరం బలహీనపడుతుంది. మెదడు కూడా స్ట్రెస్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండుగంటల్లో చేయాల్సిన పనిని గంట లేదా అరగంటలో ఎలా చేయాలో నేర్చుకోవాలి.

మీనము

ఈ రాశి వారికి కన్ఫ్యూజన్ మరియు అనుమానం ఎక్కువ. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. వారికి మంచి అనిపించిన పనిని కూడా ఇది మంచిదా, కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి కూడా మళ్ళీ వేరేవాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. తమ నిర్ణయం మంచిది అయినా అనుమానం కారణంగానే సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇదే వీరి యొక్క వీక్ నెస్ మరియు వ్యసనం.

ఇది ఎవరినీ బాధపెట్టాలని కాదు గానీ, మీ రాశుల ప్రకారం మీలో (అందరిలో కాదు లెండి) ఉన్న వ్యసనాలు, వీక్ నెస్ లు ఇవే అని చెప్పడమే మా ఉద్దేశం.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon