మీ ఇంట్లో ఈ 3 వస్తువులు ఉండకూడదు : కుటుంబంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి
మన పెద్దలు, శాస్త్రాల గురించి బాగా తెలిసిన వారు, మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు బాగా తెలిసిన వారు చెప్పిన ప్రకారం మన ఇళ్లలో ఈ వస్తువులు ఉంచుకోకూడదని అంటున్నారు. ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వలన వాస్తు దోషం మరియు కుటుంబ సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు. ఆ వస్తువులు ఏవో మీరే చూడండి.
పగిలిన అద్దం
మనం ఇంట్లో ఉపయోగిస్తున్న అద్దం పగిలిపోయినప్పుడు అందులో చూసుకోకూడదని అంటున్నారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా పగిలిన అద్దంలో చూసుకోవడం వలన దురదృష్టం అని, ఇంటికి వాస్తు దోషం కలుగుతుందని అంటున్నారు. ఐతే పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే ప్రమాదవశాత్తు మళ్ళీ కిందపడితే కాళ్లకు గుచ్చుకుంటాయనే ఇంట్లో ఉంచకూడదని అనేవారు లేకపోలేదు.
జిల్లేడు చెట్టు
ఇంట్లో మరియు ఇంటి పరిసర ప్రాంతాలలో జిల్లేడు చెట్టు ఉండకూడదని అంటున్నారు మన పెద్దలు. జిల్లేడు పాలు ఎంత విషపూరితమో అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉండే ఆ చెట్టు దగ్గరకి వెళ్ళినప్పుడు వాటిని తాగడం వలన ప్రమాదకరం కాబట్టే ఇంట్లో ఉంచకూడదని అంటున్నారు.
గోర్లు
గోర్లను ఇంట్లో కత్తిరించడం మీ ఇంటికి శుభ సూచికం కాదని అంటున్నారు పెద్దలు. ఇంట్లో గోర్లను కత్తిరించడం, ఆ కత్తిరించిన గోర్లను ఇంట్లోనే పడివేయడం వలన నడుస్తున్నప్పుడు కాళ్లకు గుచ్చుకుంటాయనేది ఒక కారణం కాగా, ఇది మీ ఇంటికి మంచిది కాదనే మరొక కారణం.
మురికి నీరు
చాలామంది ఇళ్లలో ఎక్కువకాలం తమకు తెలిసో తెలియకో మురికి నీటిని స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పటికీ ఉంచకూడదని అంటున్నారు పెద్దలు. అలాగే బయటి నుండి రాళ్లను, ఇతరుల ఇంటిని కూల్చినప్పుడు అక్కడి నుండి రాళ్లు, ఐరన్ వంటి వస్తువులను తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవడం అరిష్టమని అంటున్నారు.
ఇది మంచో చెడో అని చెప్పడం లేదు, మీలో ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే. అలాగే ఇంకా ఇంట్లో ఏయే వస్తువులు ఉంచుకోకూడదదో మీకు తెలిస్తే మాకు COMMENT ద్వారా చెప్పండి.
