Link copied!
Sign in / Sign up
4
Shares

మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే వెంటనే ఈ 3 పనులు ఆపేయండి..

ఈ ప్రపంచం అంతా డబ్బు మయంతోనే నిండి ఉందని అందరికీ తెలిసిందే. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా సరే డబ్బు లేనిదే పని జరగదు. మనిషికీ మనిషికి మధ్య ఉన్న సంబంధాలను డబ్బు దూరం చేస్తుంది, మరి ఇలాంటి డబ్బు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చోట అవసరం పడుతూనే ఉంటుంది. అయితే మన పెద్దలు, శాస్త్రాలు చెబుతున్న ప్రకారం మీ ఇంట్లో నిలవాలంటే ఇక్కడ చెప్పుకునే పనులు చేయకూడదని అంటున్నారు. ఆ పనులేంటో మీరే చూడండి..

డబ్బు ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలి..!

లక్ష్మీదేవిని డబ్బుకు ప్రతీకగా సూచిస్తారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి కలగాలంటే కొన్ని నియమాలు, పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో ఉండాలంటే ఇక్కడ చెప్పుకునే విషయాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు పెద్దలు.

▪️ తులసి చెట్టు ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి చెట్టు దగ్గర ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించాలి.

 

▪️ చీపురుని ఎక్కడపడితే అక్కడ ఇంట్లో పారవేయడం, చీపురును తొక్కడం, చీపురు పుల్లలను తుంచి ఇంట్లో పడేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని అంటారు.

▪️ లక్ష్మీదేవిని పూజించే చోట నెమలి ఈకను ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.

▪️ ఇది చాలామందికి తెలియకపోయుండవచ్చు. మీ ఇంట్లో వాళ్లకు కాకుండా బయటివారికి గానీ తెలియనివాళ్ళకు గానీ తలకు నూనె పట్టించడం వలన డబ్బు నిలవదని అంటారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళను లేదా మీకు తెలిసినవాళ్లను అడగండి.

▪️ ఇంట్లోకి ఎంటర్ అయ్యేముందు వాకిలికి దగ్గరలో విమ్ చైమ్స్ ను వేలాడదీయటం వలన మీ ఇంట్లో పాజిటివ్ శక్తి ఉంటుందని, దీని ఫలితంగా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారని అంటారు.

▪️ మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా మీ ఇంట్లో ధనం బయటకు వెళ్ళదని చాలామంది ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. మనీ ప్లాంట్ ను ఇంట్లో కూడా ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలట, ఇలా చేయడం వలన ఇంట్లో పాజిటివ్ గా ఉండటమే కాకుండా ధనబలం బాగా ఉంటుందని అంటున్నారు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon