Link copied!
Sign in / Sign up
88
Shares

మీ గురించి మీ భర్తకు మాత్రమే తెలిసిన రహస్యాలు!!

పెళ్ళి అయిన తరువాత భర్తతో జీవితం మొత్తం పంచుకుంటాం. జీవితం అంటే…. సంతోషం, బాధ, కష్టాలు, సుఖాలు.  వీటితో పాటు చిన్న చిన్న రహస్యాలు కూడా  జీవితంలో భాగమే. మీరు చిన్నప్పటి నుంచి ఎవరికీ తెలీకుండా చేసిన పనులు, మీ గురించి ఈ ప్రపంచంలో  ఎవరికీ తెలియని కొన్ని విషయాలు,  మీ ఆయనతో మాత్రమే చెప్పాలనిపిస్తుంది. అలా మీ గురించి మీ ఆయనకు మాత్రమే తెలిసిన విషయాలు ఏంటో చూడండి…..

1.మీ నిజమైన ప్రవర్తన

“మన చుట్టు ఎవరు లేనప్పుడు…మనం ఎలా ఉంటామో, అదే అసలు మనం”...ఈ ప్రపంచానికి మీరు ఎలా తెలుసో అది నిజం కాదు. మీరు ఇంట్లో ఉన్నపుడు,  పాటలు ఎంత చెత్తగా పాడుతారో, చిన్నపిల్లలా ఎలా ప్రవర్తిస్తారో, ఎలా అలుగుతారో , ఎంత మొండిగా ఉంటారో….ఇవన్నీ మీ ఆయనకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని మీ ఆయన కూడా అలాగే ఇష్టపడుతాడు కదా…

2.మీ లక్ష్యాలు

మీ జీవితంలో లేదా కెరీర్ లో, మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారో అందరికి చెప్పాలనిపించదు. నిరాశపరుస్తారనో, లేదా మీరు అనుకున్నవి జరగవనో మీరు అనుకున్న విషయాల గురించి ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. కానీ మీ ఆయనకు మాత్రం మీ అన్ని లక్ష్యాల గురించి తెలుసు. ఒక 5 సంవత్సరాల తరువాత, మీ కెరీర్ లో మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారో కూడా చెప్పగలడు.

3.మీ భావాలను ఎలా ప్రకటిస్తారు

బాగా కోపం వచ్చినప్పుడు, లేదా సంతోషం కలిగినప్పుడు ఇలా కొన్ని సందర్భాల్లో మన దగ్గర మాటలన్నీ అయిపోతాయి. అప్పుడు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఏమి అనుకుంటున్నారో అర్ధం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక్క మీ శ్రీకారికి తప్ప. మీరు మౌనంగా ఉన్నా, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో మీ ఆయనకు తెలుస్తుంది.

4.మిమ్మల్ని ఎలా బుజ్జగించాలి

మీకు కోపం వచ్చినప్పుడు, లేదా మీరు అలిగినప్పుడు మిమ్మల్ని బుజ్జగించడం ఎవరి వల్ల కాదు. కానీ మీ ఆయన ఒక చిన్న చిరునవ్వుతో అంత సెట్ చేస్తాడు. మీకు కోపం వస్తే ఎలా తగ్గించాలో, అలిగితే ఎలా బుజ్జగించాలో మీ ఆయనకు బాగా తెలుసు.

5.మీరు ఏ సమయంలో వంటరిగా ఉండాలనుకుంటారు

జీవితంలో కొన్నిసందర్భాల్లో, లేదా రోజులో అప్పుడప్పుడు మనకు వంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఆ కాస్త సమయంలో..జీవితం ఎలా గడుస్తుంది, మనం ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా జీవితంలో ఎం చేయాలి..ఇలా మనకు మనం వంటరిగా ఆలోచిస్తాం. అలా మీరు ఏ సమయంలో ఉంటారో మీ ఆయనకు బాగా తెలుసు. అలాంటి సమయంలో మీ ఆయన మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉంటాడు.

6.మీ బలం-బలహీనత

మీరు ఏ పని బాగా చేయగలరు, దాని పరిమితులు ఏంటి? ఏలాంటి విషయాలను అధిగమించేందుకు కష్టపడతారు. ఇలా మీ బలాలు, బలహీనతల గురించి మీ ఆయనకు అన్ని తెలుసు. మీ బలహీనతలను అధిగమించడానికి మీకు సహాయం కూడా చేస్తాడు.

7.మీ భయాలు

మీరు వంటింట్లో బల్లినో, బోధ్దింకనో చూడగానే భయం తో పరుగులు తీస్తారు కదూ. మీ గురించి ఈ విషయం అందరికి తెలుసు. కానీ ఇంకా చాలా చిన్న విషయాలకు కూడా భయపడుతారు. వాటి గురించి ఎవ్వరికి తెలీదు. మీ ఆయనకు తప్ప... 

మీ ఆయనకు share చేసి..ఇవన్నీ నిజామా..కాదా ఒకసారి తెలుసుకోండి...

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon