Link copied!
Sign in / Sign up
21
Shares

మీ చిన్నారుల గోళ్లు కట్ చేయడానికి చాలా సులభమైన మరియు సురక్షితమైన 3 మార్గాలు

అమ్మయినప్పటి నుంచి మీ పై బాధ్యతల భారం పెరిగి పోతుటుంది. పిల్లల పై మీకున్న ప్రేమ, వారి కోసం పడే తపన భారాన్ని తేలిక చేస్తాయి. పిల్లల తిండి దగ్గర నుంచి  శుభ్రత వరకు అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటాం. కానీ కొన్ని విషయాలలో మాత్రం బయపడుతుంటాం. అలా చాల మంది అమ్మలు భయపడే విషయం పిల్లల గోళ్లు కట్ చేయడం. ఆ చిన్న వేళ్ళకు వున్న గోళ్లను కట్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా గాయమవుతుందో ఏమోనని విలవిల లాడిపోతాం. చిన్నపిల్లలకు గోళ్లు చాల త్వరగా పెరుగుతాయి, అవి కట్ చేయకపోతే వాటితో మొఖం మీద గీసుకునే ప్రమాదం వుంది. అందుకని వాటిని ఎప్పటికప్పుడు కట్ చేయాలి.

భయపడకుండా, సులభంగా, సురక్షితంగా గోళ్లు కట్ చేయడానికి ఈ మూడు చిన్న విషయాలు తెలిస్తే చాలు.

1.ఫైల్(File) చేయండి

కట్ చేయడానికి భయపడే వాళ్ళు గోళ్లను ఫైల్ చేయడం మంచిది. నిజానికి ఫైల్ చేయడం కత్తిరించడానికన్నా సులభం. కానీ చిగురులు దగ్గర చాలా జాగ్రత్తగా వుండండి. నిదానంగా చేయండి. పిల్లల వేళ్ళు చాలా సున్నితంగా ఉంటడం వలన గాయలయ్యే ప్రమాదం ఉంటుంది.

2. బేబీ నైల్ కట్టర్ వాడండి

పిల్లల గోళ్లు కట్ చేయడానికి సాధారణంగా దొరికే ఏదో ఒక నైల్ కట్టర్ ను వాడేస్తూవుంటాం. అలా చేయడం మంచిది కాదు. పిల్లల కోసమే ప్రేత్యేకంగా మార్కెట్ లో బేబీ నైల్ కట్టర్లు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా సరే కట్ చేయడానికి అవి మాత్రమే వాడాలి. ఈ మధ్య కాలం లో బాటరీ తో పని చేసే బేబీ నైల్ కట్టర్లు, ట్రిమ్మర్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటిని కొన్నపుడు ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే వాడండి.

3. నిద్రపోయేటప్పుడు కట్ చేయడానికి

పిల్లలకు గోళ్లు కట్ చేసేటప్పుడు కదులుతూ వుంటారు. అలాంటప్పుడు పోరపాటున వేళ్ళకు గాయలయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి పరిష్కారం వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కట్ చేయడం. అప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం, కదలడం లాంటివి చేస్తారు. వాళ్ళను నిద్ర లేపే ఏ అలికిడి చేయకుండా, త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నించండి.

కొంతమంది పిల్లల గోళ్లను కట్ చేయకుండా , కొరకడం, గిల్లడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఎప్పుడు చేయకూడదు.  కొరికినప్పుడు మీ నోట్లో వున్న క్రిములు వాళ్ళకి హాని చేస్తాయి. గోళ్లు గిల్లడానికి ప్రయత్నిస్తే, పొరపాటున చిగురులు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పద్దతులను ఎప్పుడు వాడద్దు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon