Link copied!
Sign in / Sign up
72
Shares

మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు ఎలాంటివారో తెలుసుకోవచ్చు : ఎలాగో మీరే చూడండి

సహజంగా ప్రతి ఒక్కరికీ తమ గురించి కన్నా, ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాగే తమ తమ భవిష్యత్, వ్యక్తిత్వం, ఎలాంటివారో తెలుసుకోవడానికి జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు. ఇది కూడా అటువంటిదే. మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే జపాన్ దేశంలో తమ లైఫ్ పాట్నర్ ను బ్లడ్ గ్రూప్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ తెలుసుకోండి.

A పాజిటివ్

ఈ బ్లడ్ గ్రూప్ ప్రకారం వీరు ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. అందరినీ కలుపుకునిపోయే స్వభావం వీరిది. తమ తోటివారిని ముందుండి నడిపిస్తూ నాయకుడిగా ఉంటారు.

A నెగటివ్

ఈ బ్లడ్ గ్రూప్ ప్రకారం వీరికి పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు. ఎంత సమయమైనా కానీ, ఎంత కష్టమైనా సరే హార్డ్ వర్క్ చేయడమే వీరికి తెలుసు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూ ఉంటారు. పనికి భయపడి ఎగ్గొటే టైప్ కాదు.

B పాజిటివ్

ఈ బ్లడ్ గ్రూప్ వారు బంధాలకు (రిలేషన్ షిప్స్ ) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కుటుంబానికి అండగా నిలబడతూ ఉంటారు. ఎందుకంటే వీరి కుటుంబమే వీరికి బలం, బలహీనత కాబట్టి. తనవాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిధ్దమే కానీ ఇతరులపై నమ్మకం కాస్త తక్కువ.

B నెగటివ్

వీరికి స్వార్థం ఎక్కువ. మొదట నేను బాగున్నానా లేదా అనేది చూసుకుంటారు. ఇతరుల గురించి తెలుసుకోవడం, వారికి ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం అంటే వీరికి ఇష్టం ఉండదు.

AB పాజిటివ్

ఈ బ్లడ్ గ్రూప్ వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ఆలోచిస్తారో చెప్పడం చాలా కష్టం. అలాగే అంతకుమించి తెలివైన వారు కూడా.

AB నెగటివ్

వీరు చాలా చాలా తెలివైనవారు. వీరు చెప్పే మాటలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అలాగే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం. ఎందుకంటే అన్ని విషయాలు విడమరిచి చెబుతారు మరియు అందరితో కలిసిపోతారు కాబట్టి.

O పాజిటివ్

ఈ బ్లడ్ గ్రూప్ వారు గ్రూపును బట్టే మంచి హృదయం కలవారు. ఇతరులు ఏదైనా సమస్యలో ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఎంత పెద్ద సమస్య అయినా సరే అవసరానికి అండగా నిలబడి సహాయం చేస్తారు.

O నెగటివ్

ఈ బ్లడ్ గ్రూపును బట్టి వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అయితే ఎవరినీ సులభంగా నమ్మరు మరియు సహాయం చేయలేరు. కానీ విజయం సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon