Link copied!
Sign in / Sign up
0
Shares

మీ బిడ్డను ప్రమాదకరమైన ఎండ నుంచి ఎలా కాపాడుకోవాలి


ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎండ వేడి తట్టుకోలేక మనమంతా అవస్థపడుతుంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి, చర్మసంరక్షణకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎండలో తిరక్కుండా పెద్దవాళ్లే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సూర్యకిరణాలు ఆరోగ్యకరమే అయినా, పసిబిడ్డలకు డైరెక్ట్ గా ఎండ సోకకూడదు. తీక్షణమైన సూర్యకిరణాల నుంచి వారిని రక్షించుకోవాలి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎండ తాకిడి తగలకుండా రక్షణకోసం సన్ స్క్రీన్ వాడడం చాలా అవసరం. అతి సుకుమారంగా ఉండే బిడ్డల్ని ఎండ నుంచి కాపాడేందుకు వాడేదే సన్ స్క్రీన్.

సూర్యకిరణాలు డైరెక్ట్ గా బిడ్డ మీద పడితే, ముందు ముందు అది వారి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒక్కో పాప లేదా బాబు చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. అందుకు తగ్గ, అనువైన సన్ స్క్రీన్ వాడాలి.

మార్కెట్ లో రకరకాల సన్ స్క్రీన్ లు వస్తున్నాయి. కొన్నింటి తయారీలో వాడే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. అలాగని సన్ స్క్రీన్ వాడకుండా ఉండకూడదు. 

ఈ విషయంలో కొన్ని సలహాల్ని అనుసరించాలి.

1. ఏ బిడ్డ చర్మానికి ఎలాంటి సన్ స్క్రీన్ పనికొస్తుందో ఇంటర్ నెట్ లో చూసి కూడా తెలుసుకోవచ్చు.

2. బిడ్డ శరీరాన్ని పూర్తిగా కప్పేలా ఉండే సన్ స్క్రీన్ లు వాడకూడదు.

3. మీ పాప చర్మానికి అనువైన సన్ స్క్రీన్ నే ఎంచుకోవాలి.

4. మీ బిడ్డను బయటికి తీసుకెడితే చర్మం మీద ఏదోక విధంగా ఎండ పడుతుంది కాబట్టి రెండు రోజుల ముందే సన్ స్క్రీన్ వాడాలి. అలా వాడితే చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది.

సన్ స్క్రీన్ ఏర్పాటు

1. ఎండ నుంచి రక్షణ ఇచ్చేదే సన్ స్క్రీన్. ఆరు నెలల లోపు బిడ్డను బయటికి తీసుకెడితే – ఎండ తగల కుండా గొడుగు పట్టవచ్చు. లేదా ఏదైనా చెట్టు నీడన ఉండవచ్చు. ఆరు నెలలు దాటిన బిడ్డకు జింక్ ఆక్సైడ్ తో తయారు చేసిన సన్ స్క్రీన్ వాడవచ్చు.

2. మార్కెట్ లో అన్ని రకాల సన్ స్క్రీన్ లను చూసి ఎంతో కష్టపడి కొన్న దాన్ని ఎండా కాలం వచ్చు దాకా బీరువాలో దాచకండి. చలికాలంలో మంచు వల్ల కూడా చర్మం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు కూడా వాడవచ్చు.

3. సన్ స్క్రీన్ తయారీలో రకరకాల పదార్థాలు వాడతారు. హాని కలిగించే జింక్ ఆక్సైడ్, టిటానియమ్ ఆక్సైడ్ లు ఉన్న సన్ స్క్రీన్ లను ఆరు నెలల లోపు వాడకండి.

4. మీ బేబీ ముఖం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి.

మార్కెట్ లో దొరికే సన్ స్క్రీన్స్ లో మూడు బెస్ట్ వి ఉన్నాయి. వాటిని మీ బేబీకి వాడవచ్చు. అవి:

1. బడ్జెర్ బేబీ నేచురల్ ఆర్గానిక్ సన్ స్క్రీన్.

2. థింక్ బేబీ సన్ స్క్రీన్

3. బాబో బొటానికల్స్ .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon