Link copied!
Sign in / Sign up
62
Shares

మీ బిడ్డకు ఎలాంటి పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలు తెలుసుకోండి


ఓ మహిళ చీర కొనడానికి ఎంత ఆలోచిస్తుందో అందరికీ తెలుసు. దాని కలర్, ఎంబ్రాయిడరీ వర్క్, లుకింగ్.. ఇంకా అది లేటెస్ట్ ఫ్యాషన్ కు అనుగుణంగా ఉందా లేదా? ఇలాంటివి వంద ఆలోచిస్తారు. ఆ చీరను కట్టేది అమావాస్యకు ఓసారి అయినా... చీర కోసం మహిళలు పడే తపన అంతా ఇంతా కాదు. ఇలా.. ఓ చీర కోసం ఒకటికి వంద సార్లు ఆలోచించే మహిళలు.. తమ కన్నబిడ్డలకు పేరు పెట్టడానికి ఎంత ఆలోచించాలి. అది జస్ట్ పేరు మాత్రమే అయితే.. ఇన్ని పాట్ల పడాల్సిన అవసరం ఉండదు. కానీ…

గతంలో బిడ్డ పుట్టిన 21 రోజుల వరకు (కొంతమంది మూడు నెలల సమయం తీసుకుంటారు) బిడ్డ పేరు గురించి ఆలోచించేవాళ్లు కాదు. ఇక.. బిడ్డ పుట్టిన రోజు, సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతకం చూసే పండితులు.. బిడ్డకు ఏ పేరు పెట్టాలో.. జాతకం ప్రకారం వచ్చే మొదటి అక్ష‌రాన్ని చెప్పేస్తాడు. ఇక.. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కథ.

కాని.. ఈ జనరేషన్ వేరు కదా. అందుకే.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాయికి పేర్లు పెట్టేస్తున్నారు కొందరు. ఇక.. మరికొందరు బుజ్జాయి పుట్టగానే పేరు పెట్టడం కోసం తెగ ఆయాస పడుతుంటారు. ఫ్యామిలీకి చెందిన బంధువులంతా మాంచి పేరు కోసం కుస్తీలు పడుతుంటారు. మరి.. ఈ జనరేషన్ కు అనుగుణంగా పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను తిట్టుకోకుండా ఉండేలా పిల్లలకు సూటయ్యేలా పేరు ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జనరేషన్ కు తగ్గట్టుగా

గత పదేళ్ల క్రితం ఉన్న జనరేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ మరో పదేళ్లకు ఉండకపోవచ్చు. కాబట్టి.. పిల్లల జనరేషన్ ను బట్టి పేరును డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బేబీకి 50 ఏళ్లు వచ్చాక కూడా ఆ పేరు పాత బడి పోకూడదు. వయసు పెరిగినా.. పేరు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉండాలి.

యూనివర్సల్ నేమ్

ఇప్పుడు ప్రపంచం ఓ కూగ్రామం. ప్రపంచంలో ఎక్కడికైనా ఇట్టే చేరుకునే సౌకర్యాలు మనకు బోలెడు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా బతికే వెసులుబాటును ప్రస్తుతం అన్ని దేశాలు కల్పిస్తున్నాయి. అందువల్ల.. మీ పిల్లలు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా.. వాళ్ల పేరు యూనివర్సల్ గా ఉండేలా చూసుకోండి.

ఉదాహరణకు.. మధ్యయుగానికి చెందిన ఓ పేరు మహిశాసురమర్దిని ని మీ అమ్మాయికి పెట్టారనుకోండి. మన దేశంలో అయితే.. ఓకే కాని.. ఒకవేళ మీ అమ్మాయి ఫ్రాన్స్ లో సెటిల్ అయితే.. అప్పుడు ఏంటి పరిస్థితి. మీకు అర్థమయిందనుకుంట..

ఇంటి పేరుకు అనుగుణంగా

ఇంటి పేరుకు అనుగుణంగా పేరు పెట్టడం చాలా ముఖ్యం. ఇంటి పేరకు.. మీరు పెట్టబోయే పెరు మ్యాచ్ అవ్వాలి. అలా అయితేనే పిల్లల పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది. లేదంటే.. స్కూల్ స్థాయి నుంచే మీ పిల్లలను తోటివాళ్లు ఆటపట్టిస్తారు.

ఉదాహరణకు సురేశ్ శర్మ అనే వ్యక్తి తన కొడుకుకు ఆదిత్య అని పేరు పెట్టాడునుకోండి.. వాళ్ల ఇంటి పేరు శర్మ అవ్వడం వల్ల అతడు హ్యపీగానే ఫీల్ అవుతాడు.

స్పెల్లింగ్ గందరగోళం సృష్టించకూడదు

చాలామంది పేర్ల స్పెల్లింగ్ విషయాల్లో గందరగోళం ఉంటుంది. ఆ పేరును ఏ భాషలో రాసినా.. గందరగోళం లేకుండా ఉండేటటువంటి పేరునే ఎంచుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్ కన్ఫ్యూజన్ జీవితాంతం వాళ్లను బాధకు గురిచేస్తుంది.

సంప్రదాయం

బిపాషా అంటే దేవీ అని మీకు తెలుసా? ఆరాధ్య అంటే కూడా దేవతను ఆరాధించడం అని అర్థం. పురాణాలు, వేదాలు, శాస్త్రాలను అనుసరించి సంప్రదాయం ప్రకారం పేరు పెట్టాలనుకుంటే మాత్రం.. వాటికి అదే అర్థాన్ని ఇచ్చే ఎన్నో పేర్లు అందుబాటులో ఉంటాయి. వాటిని ఫాలో అయితే.. ఇటు సంప్రదాయాన్ని ఫాలో అవొచ్చు.. మంచి పేరూ పెట్టుకోవచ్చు.

అర్థవంతమైన పేరు

పేరుతో పాటు దానికి ఓ అర్థం ఉండాలి. అర్థం పర్థం లేని పేర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే.. అర్థవంతమైన పేరును పెడితే.. ఆ పిల్లలు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. అలా కాకుండా.. పింకీ, స్వీటీ, బిట్టూ, సున్నీ, సింటు, బాబీ.. ఇలాంటి ముద్దు పేర్లను వాడితే.. వాళ్లు కూడా అగౌరవంగా ఫీల్ అవుతారు.

వినసొంపైన పేరు

పేరుకు అర్థంతో పాటు వినసొంపుగా ఉండాలి. ఆ పేరును పిలిచేటప్పుడు వచ్చే సౌండ్ కూడా ఎంతో మధురంగా ఉండాలి. అప్పుడే ఆ పేరుకు ఓ సార్థకత.

ట్రెండ్ కు తగ్గట్టుగా

నేటితరం ఫాలో అయ్యే ఫ్యాషన్, ట్రెండ్ కు అనుగుణంగా పేరు ఉండాలి. కాని.. అది కూడా మితిమీరకూడదు. ట్రెండ్ కు అనుగుణంగా ఉండే పేర్లు యూనిక్ గానే ఉంటాయి కాని.. అవి ఈరోజుల్లో కామన్. అందుకే ట్రెండ్ కు తగ్గట్టుగా.. యూనిక్ గా ఉండే పేర్లను వెతకండి.

పర్సనల్ కనెక్ష‌న్

కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లో లేదంటే.. తమ పేర్లో తమ పిల్లల పేరులో కలవాలని తహతహలాడుతుంటారు. కాని.. ఇది అందరికీ సెట్ అవ్వదు. ఉదాహరణకు అంకుర్, పూజ దంపతులు తమ కూతురుకు వాళ్లిద్దరి పేరు కలిసేలా అనుజా అని పెట్టారు. అలాగే.. ఆదిత్య చోప్రా, రాణి దంపతులు వాళ్ల కూతురుకు అదిర అని పెట్టుకున్నారు. కాంబినేషన్ కలిస్తే సూపర్ లేకుంటే మొదటికే మోసం వస్తుంది.

మనసుకు నచ్చితే చాలు

ఇప్పటి వరకు మీరు చదివిన పాయింట్స్ ప్రకారం మీకు ఏ పేరు దొరకకుండా.. మీ మనసులో ఓ కొత్త పేరు ఉందనుకోండి. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పేరే పెట్టేయండి. మీకు నచ్చిన పేరు పెట్టడంలో ఉన్న సంతోషం ఇంకా ఎక్కడ ఉండదు.

మీరు ఇదివరకే మీ పిల్లలకు సూటయ్యే పర్ఫెక్ట్ పేరును ఎంచుకున్నారా? అయితే.. ఆ పేరును కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా.. ఆ పేరు మీకు ఎందుకు పర్ఫెక్ట్ అనిపించిందో మాకు చెప్పండి. సరేనా...

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon