Link copied!
Sign in / Sign up
1
Shares

మీ బిడ్డ యొక్క పొడి చర్మాన్ని నయం చేయడానికి 5 చిట్కాలు


పిల్లలకి పొడి చర్మం అనేది ఎంతో సహజం. వారి లేత చర్మం కై పొడి చర్మం మరియు మచ్చలు రావడం సహజం.పొడి చర్మాన్ని గుణపరిచే వాటిని వెతకడం కష్టమైనా పనే. ఆ పని మీ కోసం మేము చేసిపెట్టాము. మీ శిశువు యొక్క పొడి చర్మం కొరకు 5 చిట్కాలు ఏంటో చూసేద్దామా మరి? వీటి పై కొద్దిగా ధ్యాస వహించండి చాలు ఇవి ఎంతో సులభం మరియు మీ శిశువుకు ఉపశమనాన్ని ఇస్తుంది.

1. స్నానం చేసే సమయం

స్నానం చేసే సమయాన్ని తగ్గించండి. వారికీ మన పెద్ద వాలా లాగా నీరు కు వారి చర్మం అలవాటు పడలేదు. వారికీ 10 నిముషముల సమయం చాలు స్నానం చేయడానికై. నీరు వారి చర్మాన్ని గట్టిగ చేస్తుంది మరియు మరి చర్మం లో విడుదల అయిన నూనె పదార్ధాలను కడిగేస్తుంది. అందువలన మీ శిశువు కి స్నానం చేయించే సమయం 10 నిముషాలు మాత్రమే. ఇది పొడి చర్మం నుండి ఉపశమనం కలిగించడం లో ఎంతో సహాయపడుతుంది.

2. నీరు

శిశువుకు వారి శరీరం లో ఎల్లప్పుడు నీరు ఉండేలాగా చూసుకోండి. నీరు అనేది శరీరం లో అనేక పనులు కొరకు ఉపయోగపడుతుంది. మీ శిశువు చర్మం యొక్క తేమను ఉంచడానికి నీరు ఎంతో అవసరం.

3. మాయిశ్చరైజర్

శిశువు ఒక్క శరీరాన్ని ఎల్లప్పుడు సుబ్బరంగా మరియు తేమ తో నిండి ఉండాలి. అది పొడిచర్మం మరియు మాన్తా నుండి ఉపశమనం ఇస్తుంది. స్నానం అయిన వెంటనే మీ శిశువు కి మాయిశ్చరైజర్ తో మసాజ్ చేయడం మర్చిపోకండి. ఇది పొడి చర్మం రాకుండా ఉండటం లో సహాయపరుస్తుంది.

4. ఎండ నుండి రక్షణ

ఎండగా ఉన్న రోజులలో మీ శిశువును పూర్తిగా కప్పే దుస్తులను వేసి బయటకు తీసుకువెళ్ళండి. ఎండ లోని హానికరమైన కిరణాలు మీ శిశువు చర్మానికి మంచిది కాదు.

5. మైల్డ్ క్లీన్సర్ ని వినియోగించండి.

మీ పైన కూడా కఠినమైన సోయాప్స్ మరియు క్లీన్సర్ ని ఉపయోగించకండి. మీ శిశువు యొక్క చర్మం మీ చర్మం తో పోలిస్తే ఎంతో తేడా వుంటుంది. అందుకీ శిశువుల కొరకు అనేక ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి. మైల్డ్ క్లెన్సర్ మరియు రసాయనాలు లేని దానిగా చూసి ఉపయోగించండి. మీరు ఒక వస్తువు కొనే ముందు దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకుని ఉపయోగించండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon