Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలు తక్కువ సైజు, తక్కువ బరువుతో పుట్టడానికి 5 కారణాలు : అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా..!

మీరు ప్రేగ్నన్ట్ అయిన మరుక్షణం నుంచి మీ ఆలోచనలన్నీ మీ కడుపులోని బిడ్డ చుట్టే. 9 నెలల తరువాత పూట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేయాల్సిందంతా చేస్తారు, కాని పుట్టబోయే బిడ్డ తక్కువ బరువు, సైజు తో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకు కల కొన్ని కారణాలు ఇవే…

1. నెల తక్కువ

నెలలు నిండకుండానే బిడ్డ పుడితే సాధారణంగా వాళ్ళు తక్కువ బరువుతో పుడతారు. నెలలు నిండకుండానే, కాన్పు జరగడానికి అనేక కారణాలు ఉండచ్చు. ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తరచూ చెకప్ చేయించుకోవడం వలన దీనిని ముందే నివారించవచ్చు.

2. పోషకాహార లోపం

మీ ఆహార అలవాట్లు పుట్టబోయే మీ బిడ్డ బరువు, సైజు మీద ప్రభావం చూపిస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో సమతుల్యత తో కూడిన పోషకాహారం తీసుకోకపోవడం వలన, పిల్లలు తక్కువ బరువుతో పుడుతారు.

3. జీన్స్

పుట్టబోయే పిల్లల సైజు, బరువు మీద మీ జన్యువులు కూడా ప్రాభవం చూపిస్తాయి. తల్లి తండ్రులు తక్కువ ఎత్తు, బరువు ఉంటే అది పుట్టబోయే బిడ్డ యొక్క బరువును, సైజు తగ్గించే అవకాశాలు ఉంటాయి.

4. రక్త పోటు, గుండె సమస్యలు

మీకు గుండె సమస్యలు కానీ, రక్త పోటు కానీ ఉంటే బిడ్డ తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. అధిక రక్త పోటు ఉండడం వలన, పోషకాలు, ఆక్సిజన్ తగిన మోతాదులో బిడ్డకు చేరదు. ఫలితంగా బిడ్డ తక్కువ సైజు, బరువుతో పుడుతాడు.

5. ఒకరి కన్నా ఎక్కువ

మీరు కవలలు లేదా అంతకన్నా ఎక్కువ మంది బిడ్డలతో గర్భం దాల్చినప్పుడు, ఇలా జరగడానికి వీలు ఉంటుంది. మీరు తీసుకునే ఆహరం మీ కడుపులోని బిడ్డలకు సమానంగా అందక పోవచ్చు. బిడ్డలిద్దరు లేదా ఒకరు తక్కువ బరువుతో పుట్టచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon