Link copied!
Sign in / Sign up
6
Shares

మీ బిడ్డ ఆరోగ్యం కోసం 7 ఇంటి చిట్కాలు


చిన్న పిల్లలు ఎక్కువగా జబ్బు పడుతుంటారు. ఒక్కోసారి ప్రతి నెలా వారికి ఆరోగ్యం బాగలేకపోవడం జరుగుతుంది. దీనికి కారణం వారి శరీరంలోని భాగాలు ఇంకా అభివృద్ధి జరుగుతుండటమే. దీని వల్ల వారికి రోగ నిరోధక శక్తి ఉండదు. దీంతో వారు తరచుగా వ్యాధులకు గురవుతూ ఉంటారు. అయితే పిల్లలకు రోగాలు దరి చేరకుండా చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే,

స్టీమ్ మెషిన్

ఇంటిలో స్టీమ్ మెషీన్ పెట్టడం ద్వారా గాలిలో ఉండే చల్లదనం తగ్గి బేబీకి మంచి గాలి అందేలా చేస్తుంది అంతేకాక, గాలిలో ఏదైనా కాలుధ్యం ఉన్నా కూడా ఇది అదుపు చేస్తుంది. బేబీకి రోజూ వేడి నీళ్ళతో స్నానం చేయించినా కూడా వారు రోగాల భారిన పడకుండా ఉంటారు.

వెళ్ళుల్లి, జీలకర్ర

వెళ్ళుల్లి ముక్కలను, జీలకర్రను ఒక చిన్న గుడ్డలో పెట్టి ఇంటిలో ఎక్కడైనా ఉంచాలి. దీనిలో బ్యాక్టీరియాను చంపే గుణం ఉండటం వల్ల రోగాలను తగ్గించవచ్చు. దీన్ని కొద్దిసేపు వేడి చేసి బేబీ చెస్ట్ మీద, గొంతు దగ్గర మర్ధనా చేస్తే శ్వాస బాగా అందుతుంది.

నాసల్ డ్రాప్స్

పిల్లలు బాగా ఇబ్బంది పడే జబ్బులలో జలుబు ఒకటి. మీరు ముక్కులోకి వేయడానికి చుక్కల మందు తెచ్చుకొని దానిని అప్పుడప్పుడు బాబు ముక్కులోకి వేయడం వల్ల ముక్కు మొత్తం క్లీన్ అవుతుంది. దీంతో వారికి శ్వాస బాగా అంది ఉల్లాసంగా ఉంటారు.

ఆయిల్

మీకు నచ్చిన ఆయిల్‌ను తీసుకొని దానిని కొంతసేపు వేడి చేయాలి. వేడి చేసిన ఆయిల్‌కు వెళ్ళుల్లి లేదా రాళ్ళ ఉప్పును కొంచెం కలిపాలి. ఆ ఆయిల్‌ను బేబు శరీరం మీద, చెస్ట్ మీద, వీఔ భాగంలో మర్ధనా చేయాలి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఇంఫెక్షన్స్‌ను దూరం చేస్తాయి.

నిమ్మ, తేనే, అల్లం

నిమ్మ రసానికి కొంచెం తేనె కలిపి తాగించడం వల్ల దగ్గు తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే సహజ లక్షణాల వల్ల పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అల్లం, తేనెల మిశ్రమం కూడా దగ్గుకు బాగా పని చెస్తుంది. దీన్ని పిల్లలచేత తాగించడం కూడా సులభమైన పని.

పాలు

పిల్లలకు 6 నెలలు వయసు వచ్చే అంత వరకు తల్లి పాలే తాగించడం మంచిది. ఆ తర్వాత వారి స్థితిని బట్టి బయటి పాలు తాగించాలి. పాలు కొద్దిగా వేడి చేసి అందులో కాస్త పసుపు వేసి తాగించాలి. ఇది కూడా యాంటీనోడ్‌గా పని చేసి జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.

మిరియాలు

మిరియాలులో ఉండే సహజ లక్షణం వల్ల దగ్గు నుండి, గొంతు ఇబ్బంది నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. మిరియాలు, జీలకర్ర, కొద్దిగా బెల్లం వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పిల్లలచే తాగించాలి. దీంతో వారి శరీరానికి కావల్సిన శక్తి వస్తుంది. గొంతులో ఇబ్బంది ఉంటే మిరియాల సూప్ పిల్లలచే తాగిస్తే తగ్గుతుంది.

పైఅన్ని విధానల ద్వారా మీరు ఇంట్లోనే జలుబు, దగ్గుకు సంబంధించిన టిప్స్ ప్రయత్నించవచ్చు. వీటి వల్ల మీ పిల్లల ఆరోగ్యం అదుపులో ఉండే అవకాశం ఉంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon