Link copied!
Sign in / Sign up
1280
Shares

మీ బిడ్డ బరువు పెరగడం లేదా? అయితే ఒక్కసారి ఈ ఆహారాన్ని ట్రై చేయండి

కొంత మంది పిల్లలు వారి వయసుకు తగినంత బరువు పెరగరు. దీనికి అనేక కారణాలు ముఖ్యంగా సరైన పోషకాలు   పిల్లలకి అందకపోవడమే.దీనిని తల్లిదండ్రులు  గమనించి వారికి పౌస్టికరమైన ఆహారం అందివ్వాలి. పిల్లలు ఎలాంటి ఆహారాన్ని ఇస్టంగా తింటున్నారు, ఏ ఆహరం  తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తునాయి వంటి  వాటి గురించి తల్లిదండ్రులు అవగాహన పొంచుకోవాలి. పసి వయస్సులో ఉన్న పిల్లలకి పిండి రూపంలో ఆహారం అందివ్వడం మంచిది. కాని అలాంటి ఆహారం ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరికే వాటిని ఎంత వరకు నమ్మొచ్చు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు మీ మదిలో మెదలక మానవు. అందుకే మీ కోసం సహజంగా  ఇంట్లోనే పిల్లలకి నచ్చే మరియు పౌస్తికరమైన ఆహారం (పిండి) తయారు చేసుకోవడం ఎలానో క్రింద చెప్పబడినది. ముందుగా కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.

కావలసిన పదార్థాలు
  1. బాద౦ పప్పు (100 గ్రాములు)
  2. జీడి పప్పు (100 గ్రాములు)
  3. వాల్ నట్స్ (100 గ్రాములు)
  4. పిస్తా (100 గ్రాములు)
  5. కారడమోమ్స్ (10)
  6. బ్లాక్ గ్గ్రామ్స్ (200 గ్రాములు)
  7. గ్రీన్ గ్రామ్స్ (150 గ్రాములు)
  8. వోట్స్ (150 గ్రాములు)
  9. బార్లీ (150 గ్రాములు)
  10. నువ్వు గింజలు (150 గ్రాములు)
  11. ఫింగర్ మిల్లెట్స్ పిండి (500 గ్రాములు)
  12. సోయా పిండి (200 గ్రాములు)
తయారు చేయు విధానము

ముందుగా బ్లాక్ గ్గ్రామ్స్ , గ్రీన్ గ్రామ్స్, బార్లీ మరియు వోట్స్ని విడివిడిగా తీసుకొని సన్నని వేడి మీద వేయించాలి. రంగు మారి మంచి వాసన వచ్చిన  తర్వాత పెనుము మీద నుంచి తీసి చల్లారబెట్టాలి. మరో వైపు బాదం పప్పు, జీడి పప్పు, వాల్ నట్స్ మరియు నువ్వుల గింజలును వేరువేరుగా  నలుపు రంగులోకి వచ్చే వరకు వాయించి చల్లారపెట్టాలి.

చల్లారిన తరువాత వాటి అన్నింటిని మిక్సీలో వేసి నున్నని పిండిగా మరే౦త వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మీరు తాయారు చేసుకున్న పిండితో పాటు సోయా పిండి, ఫింగర్ మిల్లెట్స్ పిండి బాగా కలపాలి. అంతే, మీ బాబుకి ఎంతో అవసరమైన పదార్థము రెడీ. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని పాలల్లో కలిపి ఇస్తే పిల్లలు చాలా ఇస్టంగా తాగుతారు. దీనిని రోజు త్రాగటం వలన పిల్లలుకు కావాల్సిన పోషకాలు అంది, అనతి కాలములోనే బరువు కూడా పెరుగుతారు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
25%
Wow!
75%
Like
0%
Not bad
0%
What?
scroll up icon