మనకు ఎంత ఇష్టమైన వారైనా సహజంగానే గొడవలు వస్తుంటాయి. ఆ గొడవల వల్ల బంధం మరింత గట్టిగా తయారవుతుంది. మీకు పెళ్ళి అయిన తర్వాత మీ భర్తతో అప్పుడప్పుడు గొడవలు రావచ్చు. ఒక్కోసారి అవి పెద్దగా మారి మీ రిలేషన్‌కే ఇబ్బంది కలగవచ్చు. అయితే, మీ భర్తతో గొడవ పడకూడని, సర్ధుకుపోవాల్సిన సంధర్భాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,
లోపాన్ని చూపడం
నిజంగా ప్రేమించే మగవారు తమ భార్యలను పూర్తిగా నమ్ముతారు. కాబట్టి భార్యల నుండీ వారు ఎత్తిచూపే లక్షణాన్ని సహించలేరు. మీ భర్తలో నిజంగా ఏ లక్షణమైనా మీకు నచ్చకపోతే సున్నితంగా చెప్పాలి అంతేకానీ, మీరిలా, మీరలా, మీ వల్లే ఇలా జరిగింది అన్న మాటలు మాట్లాడకండి.
మునుపటి తప్పులు
మీరు ఏదైనా వాగ్వాదం చేసేటప్పుడు ప్రస్తుతానికి సంబంధం లేని, ముందు జరిగిన విషయాన్ని లేదా తప్పును ముడి పెట్టకండి. ఎందుకంటే, ఆ తప్పుకు వారు ఇప్పటికే పశ్చాత్తాపపడి ఉంటారు. మాళ్ళీ గతాన్ని తవ్వడం ద్వారా రిలేషన్ దెబ్బ తినవచ్చు.
నిశబ్ధాన్ని చేదించండి
మీరు ఎంత అనోన్య దంపతులైనా ఒకరి మనసులో ఏముందో మరొకరికి తెలియదు. కాబట్టి మీకు ఏదైనా కావాలనుకున్నా, మీ మనసులో ఏదైనా ఆలోచన ఉన్నా చెప్పడం మంచిది. దీంతో అతను మీకు ఏమి కావాలో సమకూర్చుతారు.
తక్కువ చేసి మాట్లాడటం
మీ భర్త ఏదైనా పొరపాటు చేసినా, మీకు అనుకూలంగా చేయకపోయినా తక్కువ చేసి మాట్లాడకండి. మరీ ముఖ్యంగా మీరెప్పుడు ఇంతే, ఈ మాత్రం తెలియదా, నా కోసం మీరు ఏమీ చేయలేదు వంటి జాతియాలు ఉపయోగించకండి. ఈ మాటలకు మగవారు ఎక్కువగా బాధపడతారు.
టాపిక్ మార్చకండి
మీరు ఏ విషయం మీదైనా ఆర్గ్యూ చేస్తుంటే, ఉన్నట్లుండి టాపిక్ మార్చకండి. వీలైనంతగా డిఫెండ్ చేయండి. ఓకవేల మీదే తప్పైతే సర్ధుపోండి. ఉన్నట్లుండి టాపిక్ మారిస్తే మీరు తప్పు చేశారని వారు బావించే అవకాశం ఉంది.
ఎక్కువగా సీరియస్‌గా పోట్లాడకండి
మనం కావాలనే ఎవరినీ హర్ట్ చేయము. మన బాగస్వామి విషయంలో ఇది మరింత ఎక్కువగా పాటిస్తాము. ఏదైనా విషయంలో మీ భర్తదే తప్పైనా పెద్దగా వాగ్వాదం చేయకండి. తప్పు చేసినప్పుడు మీ భర్త గిల్టి ఫీల్ అవుతారు. ఆ సమయంలో మీరు పోట్లాడితే మీభర్త బాగా హర్ట్ అవుతారు కాబట్టి వారు తప్పు చేసిన సమయంలో మీ అండ ఉంటే మీ మీద గౌరవం పెరుగుతుంది.
వారి లుక్ గురించి
మీ భర్త పెళ్ళి చేసుకున్నప్పుడు ఉన్నంత అందంగా ఆ తర్వాత ఉండకపోవచ్చు. జుట్టు రాలడం, లావు అవడం వంటివి జరిగినప్పుడు సీరియస్‌గా ఎగతాలి చేయకండి ఎందుకంటే, ఆయన ఇప్పటికే వాటి గురించి బాధపడుతూ ఉంటారు. మీరు ఎగతాలి చేస్తే మీభర్త మరింత బాధపడతారు. ఇది మీ రిలేషన్ మీద ప్రభావం చూపిస్తారు.
ఇతరులతో పోల్చడం
ఇతరులతో మన స్థితిని పోల్చుకుంటే నిరాశ మనల్ని ఆవహిస్తుంది. కాబట్టి, మీ బంధువుల జంటనో, ఇరుగుపొరుగు జంటతోనో మిమ్మల్ని పోల్చకండి. దీని వల్ల అతనికి నిరుత్సాహంతో పాటూ కోపం కూడా వస్తుంది.
కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురాకండి
మీ భర్త యొక్క కుటుంభ సభ్యుల విషయాలను మీ వివాదంలో తీసుకురాకండి. మీ భర్త బందువుల ప్రమేయం ఉంటేనే తీసుకురండి. ఇలా చేయడం వల్ల అతను డీప్‌గా హర్ట్ అవుతారు.
ఎప్పుడూ గౌరవించండి
ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే, ఈ జీవితానికి అతనే మీ బాగస్వామి కాబట్టీ అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. పోట్లాట జరిగేటప్పుడు కోపంగా మారినా అవి అయిన తర్వాత తిరిగి మీరు సౌమ్యంగా ఉండండి. దీంతో మీ భర్త మిమ్మల్ని మరింత ఎక్కువ అర్థం చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి
మీ భర్తతో ఎప్పుడు అనకూడని 5 మాటలు
