Link copied!
Sign in / Sign up
40
Shares

మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పడానికి 5 గుర్తులు


భార్య భర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న గొడవలు, అలకలు జరుగుతూనే ఉంటాయి, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని సాగిపోతే సంసారంలో గొడవలు ఉండవు. అదే చిన్న చిన్న గొడవాలను పరిష్కారించుకోకుండా వాటిని పొడిగించుకుని సంసారాలను సమస్యల పాలు చేసుకుంటున్నారు. అవి భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచి చాలా తీవ్రమైన సంఘటనలకు దారి తీస్తాయి. మీ మధ్య ఇలాంటి సమస్యలు తీవ్రమవ్వక ముందే  మీ భర్త ప్రవర్తన ద్వారా వాటిని  గుర్తించవచ్చు… ఆ గుర్తులేంటో ఇక్కడ చూడండి…

1. మాటలుండవు

ప్రతి రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే మీ పక్కన కూర్చొని ఆ రోజంతా జరిగిన విషయాలన్నిటి గురించి మీకు చెప్పే మీ భర్త, ఈ మధ్య అలా చేయటం లేదా. తనలోని ఈ మార్పు ఏదైనా సమస్య మొదలవడానికి సూచిక కావచ్చు. మీ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటే దానిని పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి.

2. వంట నచ్చట్లేదా

మీరు ఎంత బాగా వంట చేసిన, తనకు ఇష్టమైన వంట రోజు చేసిన ఏదో ఒక వంకతో మీ వంటను మిమ్మల్ని కలిపి తిట్టడం, ఇవన్నీ వేరే విషయాల మీద తనకు ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్రయత్నించడం. ఈ కోపాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. మీ వైపు నుండి ఏదైనా తప్పు జరిగి ఉంటే పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి.

3. నేరుగా చూడకపోవడం

ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పడు, ఏదైనా విషయం గురించి అడగాలనుకున్నప్పుడు లేదా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ వైపు చూడకుండా మాట్లాడుతున్నాడా? ఇది మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇలా జరుగుతుంటే మీ ఆయన మీ నుండి ఏదైనా విషయాన్నీ దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు. మీరు మీ ఆయనతో మాట్లాడి ఆ విషయం గురించి తెలుసుకోండి. పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి.

4. పడకగదిలో 

భార్య భర్తల మధ్య అందమైన క్రీడ ఒకరి పై ఒకరి ప్రేమను తెలుపుకునే ఒక సాధనం. అది మీ మధ్య పరిపూర్ణంగా జరుగుతూ ఉంటే మీ దాంపత్యం సంతోషంగా ఉన్నట్టు. అలాకాకుండా మీరు ఇష్టం చూపిస్తున్నా సరే, మీ భర్త దీనిపై ఇష్టం చూపించక పోతే. అది మీ భర్త ఇష్టాన్ని కోల్పోడానికి ఒక సూచిక కావచ్చు. అందుకే మీ ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడి అసలు కారణం ఏంటో తెలుసుకోండి.

5. చిరాకు

చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక గొడవ పెట్టుకుని ప్రతి విషయంలో మీ మీద చిరాకు పడుతున్నారా?  ఈ చిరాకు కు కారణం ఇంకా పెద్ద గొడవలకు దారి తీయచ్చు. అందుకే ఆ చిరాకుకు కారణం ఏంటో ముందే తెలుసుకుని పరిష్కరించుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon