ప్రతి భార్యకు భర్త కంటే స్పెషల్ ఎవరుంటారు చెప్పండి. మీ భర్త మంచి వారు అయితే ఆయన మీకు మరింత స్పెషల్. ఈ విషయం తనకి తెలియ చేయాలంటే ఎలా? మాటలతో చెప్పొచ్చు లేదా పనులతో చూపించవచ్చు. మాటలతో చెప్పడం కన్నా పనులతో చూపిస్తే మీ వారు స్పెషల్గా ఫీల్ అ య్యి మిమ్మల్ని మరింత ఇష్టపడతాడు. ఇప్పుడు చేతలతో ఆయన మీకు ఎంత స్పెషలో తెలపడానికి 6 మార్గాలు ఏమిటో తెలుసుకుందాము.
1. పొగడండి

పగడ్తకు పాడనీ మనిషంటూ లేడు. అలాగే మీ ఆయనే చేసే చిన్న మంచి పనిని పొగడండి. కొత్త బట్టలు వేసుకుంటే మీ భర్త మీ కళ్ళకు ఎంత అందంగా కనపడుతున్నాడో తెలియచేయండి.
2. ఆయన మీకు భర్తగా రావడం మీ అదృష్టం అని తెలిసేలా చేయండి
మీ కోసం ఆయన ఏమైనా చేస్తే సింపుల్గా థాంక్స్ అని చెప్పడం కాకుండా తనకు ఇష్టమైన వంట చేసి పెట్టడం వంటివి చేయండి. మీకోసం ఆయన చేసిన చిన్న పనికి మీరు ఇచ్చే విలువ తెలుసుకొని సంతోషపడతారు. మీకోసం మరెన్నో చేయడానికి ప్రయత్నిస్తాడు.
3. ప్రోత్సహించండి
పైకి కనపడరు కానీ మగవారు ఎప్పుడూ తన భార్య ప్రత్సాహం కోరుకుంటారు. మీ భర్త ఏ పని చేయడానికైనా భయపడుతున్న, ఒక నిర్ణయానికి రాలేకపోయినా ప్రోత్సహించండి మరియు సహాయం చేయండి. మీరు ఇచ్చే చిన్న సలహా కూడా ఆయనకు ఎంతో ముఖ్యం అని మాత్రం మర్చిపోకండి.
4. మంచి శ్రోతగా ఉండండి
మగవారు ఎక్కువగా మాట్లాడుతారు. మీ ఓపిగ్గా వింటే ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే ఒక మనిషి వారే వాళ్ళ మాటలు వినాలంటే టాపిక్ అయినా బాగుండాలి లేదా మాట్లాడే మనిషి అయినా నచ్చాలి. కాబట్టి మీ భాధ అంటే మీకు ప్రేమ కాబట్టి టాపిక్ బాగాలేకపోయినా ఓపిగ్గా వినండి. మీ ప్రేమను ఆ విధంగా కూడా తెలియచేయండి.
5. వారి ఆరోగ్యం మీద శ్రద్ద వహించండి
ఈ విషయం మేము మీకు చెప్పనవసరం లేదు అనుకోండి, మీరు ఎలాగో చేస్తుంటారు. కానీ గుర్తు చేస్తున్నాం అంతే. మీ భర్త పనిలో పడి తన ఆరోగ్యం మీద ద్రుష్టి సారించలేకపోవచ్చు అలాంటప్పుడే మీరు చొరవ తీసుకొని అతనికి కావాల్సినవన్నీ అందేలా చేస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
6. సర్ప్రైజ్ చేయండి
ఒక భార్య తన భర్తని ఎన్ని రకాలుగా సప్రైజ్ చేయగలదో ప్రత్యకంగా చెప్పాలా. ఏ సందర్భం లేకపోయినా ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకని అడిగితే మీరు నా జీవితంలో ఉన్నందుకు నాకు ప్రతి రోజు పండగే, ప్రతి రోజు స్పెషల్ ఏ అని చెప్పండి. హఠాతుగా ముద్దు పెట్టండి. ఇలా ఎదో ఒకటి చేసి తనని సంతోషపెట్టండి.
మీకు భర్త మీకు ఎంత స్పెషలో తెలియచేస్తూ నిజానికి మీరు భార్యగా దొరకడం ఆయన అదృష్టమని తెలియచేయండి.
