Link copied!
Sign in / Sign up
38
Shares

మీ భర్త కౌగిలింతను బట్టి తనకు మీ మీద ఎంత ప్రేమ ఉందొ చెప్పచ్చు

మీ భార్య భర్తల మధ్య అనుబంధం ఇంకా బలపడాలంటే ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచుకోవాలి. ప్రేమను వ్యక్తపరచడానికి అనేక మార్గాలున్నాయి, వాటిలో కౌగిలంత ఒకటి. ఎందుకంటే స్పర్శకు చాలా శక్తి ఉంటుంది. మీరు మీ భాగస్వామిని మీరు ప్రేమగా దగ్గరకు తీసుకున్నప్పుడు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. అందుకే భార్య భర్తల మధ్య కౌగిలింతలు జరగాలి. మీ మధ్య తప్పకుండా జరగాల్సిన 5 కౌగలింతలు ఏంటో ఇక్కడ చూడండి…

1.వెనుక నుండి

మీ భర్త మిమ్మల్ని వెనుక నుండి గట్టిగా కౌగిలించుకుంటే మిమ్మల్ని తను ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్ధం. మీ ఆయన మీ పక్కనున్నప్పుడు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు.

2. నడుము దగ్గర చేయి వేసి 

మిమ్మల్ని మీ భర్త నడుము దగ్గర చేయి వేసి కౌగిలించుకున్నప్పుడు, దానికి అర్ధం. మీ ఆయన మీ మీద ప్రేమను వ్యక్త పరచడానికి ప్రయత్నిస్తున్నాడు. మిమ్మల్ని ఎప్పుడు తనకు దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు.

3. కళ్లలోకి చూస్తూ

మీ కళ్ళలోకి చూస్తూ మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటే మీ ఆయనకు మిమ్మల్ని కౌగిలించుకుని మీ ఆయనకు మీకు మధ్య చాలా లోతైన అనుబంధం ఉన్నట్టు అర్ధం. మీ ఆయన మీకు చాలా విలువిస్తాడు.

4. ఎక్కువ సేపు

మీ బాధలో, సంతోషంలో తాను మీకు తోడుగా ఉంటాననే వాగ్దానం, మిమ్మల్ని గట్టిగ ఎక్కువ సేపు కౌగిలించుకోవడం. ఇది భార్య భర్తల మధ్య తప్పకుండా జరగాల్సిన కౌగిలింత.

5. చిలిపిగా

భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగంతో పాటు కాస్త చిలిపితనం కూడా అవసరమే. అప్పుడే మీ మధ్య అన్ని సమపాళ్ళలో ఉంటాయి. ఇలాంటి కౌగలింతలు మీ మధ్య జరగాలి. 

Image Credits : BRIGHTSIDE

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon