Link copied!
Sign in / Sign up
23
Shares

మీ భర్త కోటి మందిలో ఒక్కరు అని తెలిపే 5 లక్షణాలు..

భర్తలందరు ఒకేలా ఉంటారా? ఉండకపోవచ్చు. కొందరు ప్రేమిస్తారు, కొందరు ప్రాణం కూడా ఇస్తారు. కొంత మంది తిడుతారు  కానీ ప్రేమతో తిట్టించుకునే కొంత మంది కూడా ఉంటారు. ఇలా కొంత మంది కోటికి ఒకరుంటారు. మీ ఆయన అందులో ఉన్నారేమో చూసుకోండి. 

1 . మిమల్ని మీ లాగా వుండనిస్తారు.

మన జీవిత పయనం లో మార్పు రాకుండా మనల్ని మనలా స్వీకరించే జీవిత భాగస్వామి ఉండటం చాలా అరుదు. ఆయనతో ఉన్నపుడు మనం  మారుతున్నట్టు మనకు అనిపించదు బయట లోకం కోసం కూడా మారిన సరే. మనల్ని ని మనలా స్వీకరించి మనల్ని ప్రేమిస్తారు.

2 . మార్పు మంచికే

ఆయనతో ఉన్నపుడు మనం ఇంకా మంచి మనిషి గా ఇంకా సంతోషంగా మారుతాము మనకి తెలియకుండానే , ప్రయత్నించకుండానే మారుతాము.

3 . చిన్ని పనులు పెద్ద ఆనందాలు

అయన చిన్ని పనులు అంటే కూరగాయాలు కోసి ఇవ్వడం లాంటి సహాయాలు చేసిన అది మనకి అందనంత ఆనందాన్ని ఇస్తుంది అయన వాటిని రోజు చేయకపోయినా సరే.

4 . మీ ఇష్టాలను గుర్తిస్తారు

ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినపుడు మీ ఇష్టాలని గుర్తిస్తారు. తన సౌకర్యం కన్నా మీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలదా చెప్పండి మీ భర్త కోటి మంది లో ఒకరు అని రుజువు చేయడానికి?

5 . మీ పిల్లలకు ఒక మంచి తండ్రి

ఇది పట్టించుకోకుండా ఉండవలసిన విషయం కాదు. అయన తో ప్రేమించే తండ్రి. దేవుడిని మీరు ఇంతకు మించింది ఏది అడగలేరు అనేంత మంచి తండ్రి. పిల్లలకి ఒంట్లో బాలేనపుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం అంతేయ్ కాకుండా పిల్లలకి ఏ అవసరం వచ్చిన తోడు గా ఉంటారు. ఇలాంటి లక్షణం ఈ రోజు పని చేసే తండ్రుల్లో ఉండటం చాలా అరుదు.

6 .తాను చేసిన తప్పులని ఒప్పుకోవడం.

తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. ఈ మంచి లక్షణాలు ఉన్న మగవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.

7 . మీరే తనకు అన్ని లాగా చూసుకోవడం

అయన మనసులో మీరే ఆయనకి అన్ని మీరే. మనలోని లోపాలను గురించి ఏ రోజు ఎత్తి చూపించారు. మనం ఎలా ఉన్న సరే మనల్ని ప్రేమిస్తారు.

8 . తన లక్ష్యాలు అందుకోవాలని తపన

తన లక్షయాలను అందుకోవాలని తపన ఉంటుంది వారికీ. ఎంతో పట్టుదల తో లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. వారు గెలిస్తే మనం ఎంతో గర్విస్తాం. పట్టుదలతో ఉన్న పురుషులను ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి?

9 . ... మీవి కూడా..

తన కళలు మాత్రమే కాకుండా మీ కళలు సాకారం కావాలని కోరుకుంటూ  మిమల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. మీరు గెలవడానికి తన వాళ్ళ కుదిరినంత తప్పకుండ చేస్తారు.

10 . మీ స్నేహితులు మరియు కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తారు

అందరి భర్తల్లా ఉండరు. మీ అమ్మ నాన్నలను తన అమ్మ నాన్నలుగా భావించి వాళ్ళని గౌరవిస్తారు , జాగ్రత్తగా చూసుకుంటారు.

11 . తన వైపు చూస్తున్నపుడు, ఒక సంతోషమైన భవిష్యత్తును కనిపిస్తుంది.

తన వాళ్ళ మీ జీవితం ఇంకా మంచిగా మారుతుంది అని మీకు తెలుసు. ఇంకెవ్వరి తోను జీవితాంతం గడపాలి అని మీకు అనిపించదు.  ఒక ఆనందమైన కుటుంబాన్ని , జీవితాన్ని తనలో మీరు చూస్తారు . మీరు ఊహించినట్లే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon