Link copied!
Sign in / Sign up
9
Shares

మీ భర్తతో గొడవ పడకుండా ఎలా ఉండాలి?

ఒకరితో స్నేహం చేస్తున్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు అలాగే వివాహం చేసుకున్నప్పుడు..ఇలా ప్రతి రిలేషన్ లో గొడవలు ఉండటం సహజమే.  ఎక్కడో ఒకచోట ఏదో ఒక మిస్ అండర్ స్టాండింగ్ వల్లో లేదో ఒకరి విషయాలు లేదా రహస్యాలు మీరు చెప్పకుండా వారికి తెలిసినప్పుడు, వారికి నచ్చని పనులు చేసినప్పుడు..ఇలా గొడవలు పడటం మాములే. అయితే భార్యభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా మీ సంసార జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.

కోపంతో బెడ్ రూమ్ లోకి వెళ్ళండి

మీ ఆయన మిమ్మల్ని, మీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ తన తల్లితండ్రులను, తన అక్క చెల్లెలు లేదా అన్నయ్య కుటుంబం కోసమే  అంతా చేస్తున్నాడని కొందరు భార్యలు భర్తతో ఎక్కువగా గొడవపడుతూ ఉంటారు. మొదట భర్త చెప్పేది వినాలి, ఆ తర్వాత మీ నిర్ణయం ఏంటో, మీ బాధ ఏంటో పూర్తిగా ఆయనకు తెలపాలి. అప్పటికీ వినకపోతే కోపంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటే మీ బాధను అర్థం చేసుకుని మీ వెంటే వస్తాడు.

అసలు రీజన్ ఉందేమో ఆలోచించండి

నాకు నగలు లేవు, నేను అడిగిన చీర కొనివ్వలేదు లేదా నన్ను బయటకు తీసుకు వెళ్లడం లేదు. నేనంటే నీకు ప్రేమ తగ్గింది అని కొందరు భర్తతో గొడవపడటం చేస్తుంటారు. అసలు మీ ఆయన కష్టపడేదే మీకోసం అయినప్పుడు ఎందుకు గొడవపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది. గొడవ పడాలా? వద్దా? అని..

ఒకరికి ఒకరు సహకరించుకోవాలి

ఏ బంధంలోనైనా గొడవ పడ్డాక మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ కానీ వివాహబంధంలో మాత్రం సునామీ లాంటి గొడవ జరిగితే మళ్ళీ కలవడం చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది. అందుకని ఏదైనా సరే ఒకరినొకరు సహకరించుకోవాలి. అదే మీ ఆయన తప్పు చేస్తున్నాడు అనిపిస్తే అడగండి, నిలదీయండి, మీ ఆయనపై మీకు, మీ పిల్లలకు ఉన్న ప్రేమను, నమ్మకాన్ని తెలియపరచండి.

30 సెకన్లు దూరంగా ఉండి ఆలోచించండి

ఏదైనా విషయంపై మీ ఆయనతో గొడవ పడాలి అనుకున్నప్పుడు  లేదా గొడవ పడ్డ తర్వాత ఒక 30 సెకన్ల పాటు బాగా ఆలోచించండి. గొడవ పడటం మంచిదా లేక ఆయనతో ప్రేమగా మాట్లాడి ఆ విధంగా ఉండవద్దు అని ఎలా చెప్పాలో, ఎలా చెబితే అర్థం చేసుకుంటారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

పెళ్లి అయిన రెండేళ్ళకు ఇష్టాలు మారిపోతాయి

స్నేహం, ప్రేమ, దాంపత్య బంధంలో గొడవలు రావడం, మళ్ళీ సర్దుకుపోవడం కామనే. ఐతే పెళ్లి అయిన 2, 3 ఏళ్ళ తర్వాత ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చవు, ఒకరి ఇష్టాలు మరొకరికి ఇష్టం ఉండదు, ఒకప్పుడు మీలో ఏదైతే ఇష్టం అని చెప్పారో ఇప్పుడు అది ఇష్టం లేకపోవచ్చు. అందుకే మీరు ఎప్పుడు మీ ఆయనకు కొత్తగానే కనిపిస్తూ ఉండాలి. మీ ఆలోచనలు మీ ఆయనకు అనుగుణంగా ఉంటే భర్తతో గొడవలు ఉండవు.

ఒక వ్యక్తితో జీవితం బాగుండాలంటే వారిని బాగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగేది భార్య ఒక్కరే కాబట్టి మీ దాంపత్యం బాగుండాలని కోరుకుంటున్నాం..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon