Link copied!
Sign in / Sign up
6
Shares

మీ భర్త మీతో శృంగారాన్ని ఎంజాయ్ చేశాడా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి..!!

శృంగారం అనేది కేవలం పిల్లలను కనడం కోసమే అనుకుంటే చాలా పొరపాటని, అందులో కలిగే ఆనందాన్ని, అనుభూతిని ఆస్వాదించడమే శృంగారమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి చాలామంది పిల్లల కనడానికే కదా ఇదంతా అనుకుంటూ ఉంటారు, అటువంటి ఆలోచనలు ఉన్నారు వెంటనే మీ మైండ్ లో నుండి  వాటిని డిలీట్ చేయండి. ఐతే మీ భర్త లేదా భార్య శృంగారంలో సరైన తృప్తిని, మీతో ఎంజాయ్ చేశాడా? లేదా? అని తెలిపే విషయాలు ఇవే..

మహిళలు దూరంగా వెళ్ళిపోతారు

భార్య తన భర్తతో సంతోషంగా సరైన తృప్తిని శృంగారంలో పొందలేక పోయినట్లయితే బెడ్ పై నుండి భర్తకు దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుంటారట. తనపై చేయి వేయడానికి ప్రయత్నించినా సరే ఇబ్బందిగా ఫీలవుతారని, అసలు విషయం చెప్పకుండా తమలో తామే బాధపడతారని తాజాగా ఆరోగ్య నిపుణుల పరిశోధకులు వెల్లడించారు.

మగవారు తృప్తి పొందినట్లయితే..

మగవారు తమతో సరైన సంతోషాన్ని పొందాడా లేదా చెక్ చేసుకోవడం ఎలా అనుమానం మహిళలలో ఉంటుంది. రతిక్రీడను ఎంజాయ్ చేసి స్కలనం జరిగిన తర్వాత మగవాళ్ళు భార్యకు దగ్గరగా ఉండలేరట. బెడ్ పై తన భాగస్వామికి దూరంగా ఉంటారు. మళ్ళీ తన భార్య దగ్గరకు రావడానికి కనీసం పది నిముషాల సమయం తీసుకుంటారు.

మహిళలు ఇలా చేస్తారు

అందరూ అని కాదు గానీ సగానికి పైగా మహిళలు తన భర్తతో శృంగారంలో సంతృప్తి పొందినట్లయితే సిగ్గుపడి నవ్వడం చేస్తారు. భర్తను ముద్దుపెట్టుకోవడం లేదా హత్తుకుని దగ్గరగా ఉండటం చేస్తారు. శృంగారాన్ని నిజంగా ఎంజాయ్ చేశాము అని తెలిపే వాటిలో ఇది సులభంగా కనుక్కోవచ్చని అంటున్నారు.

మగవాళ్ళు మళ్ళీ ఇలా చేస్తారు

కొన్నికొన్నిసార్లు ఒకసారి శృంగారంలో పాల్గొన్న 5, 10 నిముషాల తర్వాత మళ్ళీ పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దీని అర్థం అంతకుముందు సరైన సంతృప్తి పొందలేదని కాదు, మరోసారి ఆ ఆనందం కావాలనే ఉత్సాహం, హార్మోన్లు రెచ్చగొట్టడం వలన మళ్ళీ మళ్ళీ ఆ సంతోషాన్ని కోరుకుంటారు.

భాగస్వామి శృంగారంలో ఆనందాన్ని పొందారా లేదా అని తెలిపే విషయాలు ఇవే అని తెలిపారు ఆరోగ్య నిపుణులు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon