Link copied!
Sign in / Sign up
7
Shares

మీ భర్త మీ పిల్లలతో తప్పక చేయాల్సిన 5 పనులు : నాన్న గొప్పదనం తెలిపే విషయాలు ఇవే..

తల్లి జన్మనిచ్చేంత వరకు మాత్రమే అంటే 9 మాసాలు మాత్రమే బిడ్డను తన కడుపులో మోస్తుంది. కాని.. తండ్రి అలా కాదు.. జీవితాంతం తన బిడ్డను మోస్తాడు. పిల్లలకు కావాల్సిన అన్నింటిని సమకూర్చి పిల్లలు ఆనందంగా ఉండేలా చేస్తాడు తండ్రి. కొంతమంది తండ్రులైతే ఏకంగా తల్లి అవతారం ఎత్తుతారు. తల్లులు ఆఫీసుకు వెళ్లినా పిల్లలను ఏం చక్కా చూసుకుంటారు. అలా ఈ జనరేషన్ లో తల్లితో పాటు తండ్రి పాత్రకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇటువంటి సందర్భాల్లో తండ్రిగా ఓ వ్యక్తి ఎలా ప్రవర్తించాలి.. పిల్లలను ఎలా చూసుకోవాలి లాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమానమైన బాధ్యత

బిడ్డ పుట్టాక ఒక్క తల్లికే బిడ్డను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉండదు. తండ్రికి కూడా సేమ్ బాధ్యత ఉంటుంది. ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని తండ్రులు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. దాదాపు 9 నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. మరి అదే విధంగా తండ్రులు కూడా బిడ్డ పెరుగుదలలో తమవంతు పాత్ర పోషించాలి.

పిల్లలకు అవసరమైనవి సమకూర్చండి

పిల్లలు పుట్టాక వాళ్లకు ఎన్నో సేవలు చేయాల్సి ఉంటుంది. డైపర్స్ మార్చడం దగ్గర నుంచి పాలు పట్టడం ఇలా ఎన్నో అవసరాలు పిల్లలకు తీర్చాలి. వీటన్నింటినీ ఒక్క తల్లే చూసుకోవాలంటే కుదరదు. అందుకే తండ్రులు కూడా బాధ్యత తీసుకొని ఏమాత్రం ఇబ్బంది పడకుండా డైపర్స్ మార్చడం, నీళ్లు తాగించడం, పాలు పట్టించడం, డ్రెస్ మార్చడం, పిల్లలను సాయంకాలం అలా సరదాగా బయటికి తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటే పిల్లలతో మీకు బంధం ఏర్పడుతుంది.

పిల్లలతో కలిసి పడుకోండి

చాలా మంది పిల్లలను ఒక రూమ్ లో పడుకోబెట్టి.. తాము మరో రూమ్ లో పడుకుంటారు. తల్లి అయినా.. తండ్రి అయినా.. పిల్లలను తమ వద్దనే పడుకోబెట్టుకోవాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో లేస్తే మీ నిద్ర డిస్టర్బ్ అవ్వడమే కాదు.. వాళ్లు ఒక్కోసారి భయపడుతుంటారు కూడా. అందుకే కనీసం తల్లి అయినా పిల్లల పక్కన పడుకుంటే రాత్రి ఏదైనా సమస్య వస్తే వెంటనే తండ్రి కూడా ఆ సమస్యను తీర్చేలా ఉండాలి.

డైపర్స్ మార్చడం ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు

చాలా మంది తండ్రులే కాదు తల్లులు కూడా పిల్లలకు డైపర్స్ మార్చాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎలాగూ డే టైమ్ లో తల్లులు పిల్లలకు సేవ చేసి అలసిపోతుంటారు. రాత్రి సమయంలో పిల్లలకు డైపర్స్ మార్చడం లాంటివి తండ్రులు చూసుకుంటే చాలా బెటర్. తల్లులకు రెస్ట్ ఇచ్చినట్టూ ఉంటుంది.. పిల్లలు కూడా తండ్రికి అలవాటు పడుతుంటారు.

పిల్లలతో సరదాగా ఆడుకోండి

పిల్లలకు కావాల్సిన అవసరాలను సమకూర్చడమే కాదు.. అప్పుడప్పుడు పిల్లలతో సరదాగా గడపాలి. వాళ్లతో ఆడుకోవాలి. బొమ్మలతో పిల్లలను ఆడిపించడం, రైమ్స్ పాడటం.. లాంటివి చేసి పిల్లలను సంతోషపెట్టాలి.

పిల్లలను శక్తిమంతులుగా తీర్చిదిద్దండి

పిల్లలను ఏదో సాదామా లేదా అన్నట్టుగా కాకుండా పిల్లలను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే అసలైన సవాల్. అందుకే తండ్రులే పిల్లలకు చిన్నప్పటి నుంచే దైర్యసాహసాలను నూరిపోయాలి. వాళ్లను ఆరోగ్యం బాగుండేలా, వాళ్ల బాగోగులు కూడా చూడాలి. పిల్లలు కొంచెం పెద్దయ్యాక స్పోర్ట్స్ క్లాసులు, డ్యాన్స్ క్లాసుల్లో చేర్పించండి.

పిల్లల హోంవర్క్ లో సాయపడండి

చాలా మంది హోంవర్క్ అనగానే అదేదో తల్లికి, పిల్లలకు సంబంధించింది అని అపోహ పడుతుంటారు. కాని.. పిల్లల హోంవర్క్ లో తండ్రులు కూడా సాయం చేస్తుండాలి. తల్లులకు ఇతర పనులు చాలా ఉంటాయి కాబట్టి.. తండ్రులు పిల్లలకు హోంవర్క్ లో సాయపడితే చాలా బెటర్.

ఆర్థిక వివేకాన్ని పిల్లలకు నేర్పండి

ఇది చాలా ముఖ్యమైన విషయం. పిల్లలకు ఆర్థిక వివేకాన్ని ఎంత తొందరగా నేర్పిస్తే వాళ్లు అంత చతురతతో డబ్బుల విషయంలో నడుచుకుంటారు. వాళ్లకు ఓ పిగ్గీ బ్యాక్ ను కొనివ్వండి. వాళ్లకు కొన్ని డబ్బులు ఇచ్చి రోజూ బ్యాంక్ లో దాచుకోమని చెప్పండి. డబ్బుల విలువను వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి.

వారాంతపు సెలవుల్లో పిల్లలతో గడపండి

ఎప్పుడూ డబ్బుల వెంటే తిరగకుండా వారాంతపు  సెలవుల్లో కాసేపు పిల్లలతో గడపండి. ప్రశాంతంగా పిల్లలతో గడపండి. అప్పుడే పిల్లలకు, మీకు మధ్య బంధం బలపడుతుంది.

పిల్లలతో ఎక్కవ సమయం కేటాయించండి

తల్లి ఎలాగూ తన పిల్లలతో ఎక్కువ సమయమే గడుపుతుంది. తండ్రి కూడా తల్లిలాగానే ఎక్కవ సమయం పిల్లలతో గడపాలి. అప్పుడే పిల్లలకు, తండ్రికి మధ్య ప్రేమానురాగాలు ఏర్పడతాయి. వాళ్లిద్దరి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అందుకే తల్లి లాగానే తండ్రి కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon