Link copied!
Sign in / Sign up
5
Shares

మీ బరువును పెంచే హార్మోన్లను ఇలా నియంత్రించండి.

అధిక బరువు మహిళలలో ఒక ప్రధానమైన సమస్య. ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండడం వలన అది శరీరంలోని మిగతా అవయువాల పైన చెడు ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించిన మీ శరీర బరువును తగ్గించుకోలేకపోతున్నారా? ఇందుకు కారణం హార్మోన్స్. మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల హార్మోన్స్ మీ బరువు పెరగడానికి కారణమవుతాయి. ఆ హార్మోన్స్ ను నియంత్రించడం వలన మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. బరువును పెంచే ఆ హార్మోన్స్ ను ఎలా నియంత్రించాలో ఇక్కడ తెలుసుకోండి…

1. ఆకలి హార్మోన్

మీ శరీరంలోని క్రొవ్వు కణాలు లెప్టిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మీ మెదడుకు ఆకలి సంకేతాలను పంపుతుంది. ఈ హార్మోన్ అధికంగా విడుదలవడం వలన ఎక్కువ సార్లు ఆకలేస్తుంది. అదిక ఆహరం తీసుకోవడం వలన, బరువు పెరుగుతారు. ఈ హార్మోన్లను తగ్గించుకోవాలంటే మీరు చక్కర శాతాన్ని తగ్గించుకోవాలి. అలానే సరైన నిద్ర చాలా అవసరం. ఇలా చేయడం వలన ఈ హార్మోన్ ను నియంత్రించవచ్చు.

2. వత్తిడి హార్మోన్

శరీరం లోని అడ్రెలెన్ గ్లాండ్స్ కార్టిసోల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ అధికంగా విడుదల అయినప్పుడు మీరు ఆకలితో ఉన్నారనే సంకేతాలు మెదడుకు అందుతాయి. మీ శరీరంలోని చక్కర క్రొవ్వుగా మారుతుంది. ఆకలి పెరిగి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ఈ కార్టిసోల్ హార్మోన్ ను నియంత్రించాలి అంటే వత్తిడిని తగ్గించుకోండి. తరచుగా వ్యాయామం చేయండి.

3. ఆ హార్మోన్స్

స్త్రీలలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్లు స్త్రీల పునరుత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్స్ తక్కువగా విడుదల అయినప్పుడు, శరీరం కొవ్వు నిలిచిపోతుంది. బరువు పెరుగుతారు. స్త్రీలలో పీరియడ్స్ ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ హార్మోన్స్ విడుదల తగ్గిపోతుంది. 

image source : khabri laal

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon