మీ భర్తతో ఈ 5 మాటలు ఎప్పటికీ అనకూడదు, తెలుసుకుని జాగ్రత్త పడండి..
మీ జీవిత భాగస్వామిగా, మీ పిల్లలకు తండ్రిగా, మీ భర్త కుటుంబం కోసం చాలా బాధ్యతలు మోస్తున్నాడు. కొన్ని త్యాగాలు కూడా చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కావు. మీ ఆయనకు విలువ ఇవ్వాలని, గౌరవించాలని మీకు తప్పకుండా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, సందర్భాలు, వలన ఏదోటి అనేసి మీ ఆయనను బాధపెట్టేస్తారు. కొన్ని మాటలు భార్యభర్తల మధ్య కొంత దూరాన్ని పెంచుతాయి, అవేంటో చుద్దాం…
1. “మీ అమ్మ వుంది చూడు… “
వద్దు.. ఇక అక్కడితో ఆపేయండి. అత్త కోడలు మధ్య గొడవలు జరగడం, మద్యలో మీ భర్త నలిగిపోవడం, తల్లా .....పెళ్ళామా తేల్చుకోవడంలో పడి, జీవితాలన్నీ తెల్లారిపోవడం. ఇది చాలా కుటుంబాలలో జరిగేదే. మీరు చేయకండి. మీ అత్తగారితో మీకు సమస్య ఉంటే, మీరు దూరంగా ఉండండి. మీకు మీ భర్త, మీ కుటుంబం ముఖ్యం. ఏదైనా చిన్న విషయాలను చూసి చూడనట్టు వదిలేయండి.
2. “మీకు అసలు ఏమి తెలియదు... “
పిల్లల విషయంలోనో లేదా ఏదైనా ఇంటి పనిలోనే మీ అయన మీకు సహాయం చేసేటప్పుడు, ఏదైనా తప్పు జరిగితే, కొంచెం అలోచించి మాట్లాడండి. వెంటనే ఏదోటి అనేసి మీ ఆయనను కించపరచకండి. తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, దాన్ని గౌరవించండి.
3. “నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా..”
ఏదో సమస్య వచ్చింది…. మీకు మీ ఆయనకు పెద్ద గొడవ జరిగింది… అంతమాత్రాన… పుట్టింటికి వెళ్ళిపోతాను అని మీ ఆయనను బెదిరించకండి. మీ ఇళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు. మీరు వెళ్ళిపోతే సమస్య పెరుగుతుందే తప్ప, పరిష్కారం కాదు. ఏదైనా ఇంట్లోనే ఉండి పరిష్కరించుకోండి…
4. “మీరు నా గురించి అసలు పట్టించుకోరు….“
ఈ మాటను ప్రతి చిన్న తప్పుకి, మీ అయన మీద వాడకండి. మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళలేకపోవడం, చెప్పిన సమయానికి పికప్ చేసుకోకపోవడం, ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. మీ ఆయనకు నిజంగానే ఏదైనా పని పడిందేమో, ఆయన పరిస్థితులు కూడా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి.
5. “మీరు మారిపోయారు….”
మీ ఇద్దరి మధ్య, ఇంతక ముందులా చాలా విషయాలు ఇప్పుడు జరగక పోవచ్చు. దానికి మీ ఆయన ఒక్కడే బాధ్యుడు కాడు. అనేక విషయాలు మారాయి. ఇప్పుడు మీకు పిల్లలున్నారు, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఇవన్నీ కూడా కారణం. సమస్యను చర్చించి, మీ ఇద్దరు కలిసి ఎక్కువ సమయం గడిపే మార్గాన్ని అన్వేషించండి. ఇలాంటి మాటలు అనకండి.
