Link copied!
Sign in / Sign up
14
Shares

మీ అవయువాలా ఆకారంలో ఉండే ఈ ఆహారాలు శరీరానికి ఎంతో మేలు…

ఆరోగ్యానికి ఆహరం చాలా అవసరం. మీరు తీసుకునే ఆహరం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ అదే ఆహరం మీ ఆరోగ్యాన్ని కూడా హరించగలదు. అందుకే మీరు ఎంచుకునే ఆహరం మీ శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి. మీ శరీర భాగాల ఆకారంలో ఉండి, వాటికి మేలు చేసే ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. అవకాడో - గర్భాశయం

అవకాడో చూడడానికి మీ గర్భాశయంలా ఉంటుంది. అంతేకాదు మీ గర్భాశయానికి అవకాడో చాలా ఉత్తమమైన ఆహరం. ఇందులో ఉండే మంచి క్రొవ్వులు, పోషకాలు గర్భాశయంలో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. గర్భశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.

2. మష్రూమ్ - చెవి

ఒక పెద్ద సైజు మష్రూమ్ ను సగానికి కొస్తే అది చెవి ఆకారంలో కనపడుతుంది. నిజానికి కనపడడం మాత్రమే కాదు, అది చెవికి చాలా మేలు చేస్తుంది. అందులో ఉండే విటమిన్ ‘డి’, మీ వినికిడి శక్తిని పెంచుతుంది.

3. ఆకుకూరలు - ఎముకులు

వివిధ ఆకుకూరలలో ఉండే ఐరన్, పొటాషియం, విటమిన్లు మీ ఎముకలకు చాలా మేలు చేస్తాయి. మెగ్నీషియం, కాల్షియమ్ లను మీ ఎముకలకు అందించి దృడంగా ఉంచుతాయి.

4. కిడ్నీ బీన్స్ - కిడ్నీలు

కిడ్నీ బీన్స్ చూడడానికి అచ్చు కిడ్నీల ఆకారంలో ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే పీచు, ఇతర పోషకాలు, మీ కిడ్నీల పనితనాన్ని అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి.

5. వాల్నట్ - బ్రెయిన్

 

 

 

మెదడు ఆకారంలో ఉండే వాల్నట్, మెదడుకు చాలా మంచిది. ఇందులో ఉండే ‘డి హెచ్ ఏ’, మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చిన్న పిల్లలలో మెదడును రక్షిస్తాయి. పెదాల్లో మెదడు సంబంధిత వ్యాధులను అరికటుతుంది.

మీ శరీర భాగాల ఆకారంలో ఉండి, వాటికి మేలు చేసే ఇంకొన్ని ఆహారాలు...

 

 

 

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon