Link copied!
Sign in / Sign up
24
Shares

మీ పిల్లలను బలంగా, దృడంగా చేయడం ఎలా?

పుట్టిన పిల్లలు పైకి చూడడం, అటు ఇటు మెల్లగా తల తిప్పడం, కాళ్ళు చేతులు ఆడించడం రోజంతా వాళ్ళు చేసే పనులు ఇవే. తర్వాత ఎదిగే కొద్ది బోల్డ పడడం, దొల్లడం, ప్రాకడం లాంటివి చేస్తువుంటారు. ఇవన్నీ చాలా చిన్న పనులుగా అనిపించినా, ఈ చిన్న పనులు చేయడానికి పిల్లలకు చాలా బలం కావాలి. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి కండరాలకు మీరు ఈ బలాన్ని అందించాలి. అందుకు మీరు చేయాల్సింది ఇవే…

1. మెడ

తల పైకెతడానికి, అటు ఇటూ కదపడానికి సహాయపడేది మెడ భాగం. పుట్టిన పిల్లలలో మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. రోజు బిడ్డను కాసేపు బోల్డ పనుకోబెట్టండి, ఇలా చేయడం వలన పిల్లలు పరిసరాలను చూడడానికి మెడను పైకి ఎత్తుతారు. దీని వలన మెడ కండరాలకు వ్యాయామం దొరికి బలంగా తయారువుతాయి. పిల్లలు 6 వారాల వయసునుండి ఇలా చేయచ్చు.

2. బోల్డ పడడం

కొన్ని నెలలలో పిల్లలు దొళ్ళడం, బోల్డ పడడం మొదలుపెడుతారు. వారికి ఇది అనుకున్నంత సులువు ఏమి కాదు. దీనికి చాలా ఓపిక బలం కావాలి. బోల్డ పడుకోవడాన్ని వారికి మెల్లగా అలవాటు చేయాలి. రోజు కాసేపు పొట్ట మీద పడుకోపెట్టి వారి ముందు ఏవైనా బొమ్మలను ఉంచండి. వాటి మీద ఆసక్తి తో వారు అలానే కాసేపు ఉండడానికి ప్రయత్నిస్తారు, వాటిని చేరుకోవడానికి మెల్లగా కదులుతూ దోళ్ళడాన్ని, బోల్డ పడుకోవడాన్ని అలవాటు చేసుకుంటారు.

3. ప్రాకడం

7 నెలల నుండి 10 నెలల మధ్య పిల్లలు ప్రాకడం మొదలు పెడుతారు. ఇందుకు వారి తొడ భాగంలోని కండరాలు బలంగా ఉండాలి. ప్రాకడం అందరి పిల్లలలో ఒకేలా ఉండక పోవచ్చు. కొంతమంది చేతులు, కాళ్ళ సహాయంతో ప్రాకుతారు, కొంతమంది పొట్ట మీద ప్రాకుతారు. పిల్లలు ప్రాకడం అనేది నడవడానికి ప్రాక్టీస్ లాంటిది. పిల్లలు నెల మీద ప్రాకడానికి ప్రయత్నించినప్పుడు వారిని ఆపకండి.

4. కూర్చోవడం

పిల్లలు కూర్చోవడం మొదలుపెట్టడానికి కొంత సమయం పడుతుంది. పిల్లలు కూర్చోడానికి కండరాలు సమన్వయం చాలా అవసరం. దీనికి కొంత సమయం పట్టచ్చు. పిల్లలు కుర్చునే విధంగా ప్రోత్సాహించండి. వారికి సహాయంగా దిండులను ఉంచండి. పిల్లలు మెల్లగా కూర్చోడానికి అలవాటు పాడుతారు.

5. నడవడం

మీ పాప లేదా బాబు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరువాత నడవడం మొదలు పెడుతారు. మెల్లగా చేతులు పట్టుకుని నడిపించడం మొదలు పెట్టండి. తర్వాత వారికి వారే మెల్లగా నడవడం మొదలు పెడుతారు. ఆ ప్రయత్నంలో కింద పడుతూ ఉంటారు. మీరు కొంత దూరంలో నిలబడి వారిని మీ దగ్గరకు రాడానికి ప్రోత్సహించండి. ఎముకులు దృడంగా మారిన తరువాత పూర్తిగా నడవడం మొదలు పెడుతారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon