Link copied!
Sign in / Sign up
10
Shares

మీ భర్త తల్లి చాటు బిడ్డ అయితే అతనితో ఎలా మెలగాలి - 6 మార్గాలు

మీ భర్త ఇప్పటికి తన తల్లి దగ్గర చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటే మీకు వచ్చే కోపాన్ని, కలిగే భాధను మేము అర్థం చేసుకోగలము. భర్త అన్నాక ఎవరి మీద ఆధార పడకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోగలగాలి. అలా జరగనప్పుడు మనకు కోపం రావడం సహజమే. అతను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడాడ్డు అంటేనే తనకు మెచ్యూరిటీ మరియు పెద్దరికం ఉన్నాయని అర్థం కదా! అలాంటిది పెళ్లి తరువాత కూడా ప్రతి దానికి అమ్మ మీద ఆధారపడితే మనకు కోపం వస్తుంది.

ప్రతిఒక్కరి జీవితాలలో తల్లులు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులే అని మేము అర్థం చేసుకోగలము కానీ అది ఎక్కువ అయితే పిల్లలు తమ స్వాతంత్య్రాన్ని మరియు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. అందుకే రెండు విషయాల మధ్య బ్యాలెన్స్ ఉండాలి అనేదే మా వాదన.

మీ భర్త చేసే పనులు, కోరికలు తన అమ్మని పోలి ఉండచ్చు ఎందుకంటే తనని చూస్తూనే పెరిగాడు కాబట్టి. అలాగని మిగతా అన్నిటిని పట్టించుకోకుండా తనకు నచ్చినవి మాత్రమే కరెక్ట్ అనుకుంటే పొరపాటే. ఇలా చేయడం ద్వారా పక్కన ఉన్న వాళ్ళుని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది.

అటువంటి వ్యక్తితో మీ వివాహాన్ని పరిష్కరించుకోవడం ఇప్పుడు ఒక సమస్యగా మారుతుంది. కానీ తాను ఫీల్ అవ్వకుండా మీకు మంచి జరిగేలా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అనేది చాలా ముఖ్యమైన విషయం.

1. ప్రతి దానికి తన అమ్మని సంప్రదించడాన్ని ఆపండి

ప్రతి చిన్నదానికి మీ భర్త తన అమ్మని సంప్రదిస్తుంటే దానిని ఆపండి. కోపంగా చెప్పడం కాదు, ప్రశాంతంగా అర్థం అయ్యేలా కూర్చోబెట్టి చెప్పండి. కానీ మీకు తన తల్లి పట్ల అభద్రతా భావం ఉందని మాత్రం తెలియనీకండి. ఎందుకంటే, తన తల్లి అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడు కాబట్టి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేడు. అందుకే సున్నితంగా మనస్సుకు నొప్పి కలగకుండా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతి దానికి పెద్దవారిని ఇబ్బంది పెట్టకూడదు వంటి మంచి మాటల ద్వారా మార్చుకోండి.

2. మీ వ్యక్తిగత సమస్యలు మీరే పరిష్కరించుకోండి

ప్రతి విషయం పెద్దవారితో చెప్పాలని రూల్ ఏమి లేదు. చాల వరకు సమస్యలు మీరే పరిష్కరించుకోవచ్చు. ఒక వేల మీ భర్త వ్యక్తిగత విషయాలన్నీ తన అమ్మతో పంచుకుంటుంటే దానిని మీరు ఆపండి. మొగుడు పెళ్ళాం అన్నాక అనేక విషయాలు ఉంటాయి, కొన్ని అందరికి చెప్పగలము కొన్ని చెప్పుకోలేము. ఆ రెండిటి మధ్య తేడా తెలుసుకొని వ్యవహరించుకోవాలి.

3. తన తల్లి అభిప్రాయాలపై ఆధారపడిన ఆరోపణలను తీసుకోకండి

మీ భర్త ఇంట్లో లేనప్పుడు మీ అత్తగారితో గొడవ అవుతుంది. తాను ఇంటికి వచ్చి ఇద్దరి వాదనలు వినాలని మీరు కోరుకుంటారు. కానీ తాను మాత్రం వారి అమ్మ మాట విని మిమ్మల్ని కోపగించుకుంటాడు. ఇది సహజమే. కానీ, మీరు అలంటి సమయంలో మౌనంగా ఉండకండి, మీ వాదన కూడా వినిపించండి. తన అమ్మకి తన మీద ఎంత హక్కు ఉందొ మీకు కూడా అంతే హక్కు ఉందని మర్చిపోకండి.

4. సమయం గడపమని చెప్పండి

ఈ విషయం అత్యంత అవసరం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం మీ వైవాహిక జీవితం సాఫీగా సాగడంతో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మీ వారిని తీసుకొని పుట్టింటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులతో చనువుగా మెలగడం అలవాటు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ వారు ఎక్కువ విషయాలు తెలుసుకొని తొందరు పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాడు.

5. మీ వంతు సహాయం చేయండి

ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో అయినా మీ వారికి సంబందించినంత వరకు  మీ అభిప్రాయాన్ని చెప్పండి. తను అనుభవం ఉంది కనుక తల్లి మాటకే విలువ ఇవ్వచ్చు కానీ మీరు నిరుత్సాహ పడకండి, ఎదో ఒక రోజు మీ అభిప్రాయం విలువైనది అని తనకి అర్థమవుతుంది.

6. మీ స్థానం మీకు ఇవ్వమని చెప్పండి

మీ ప్రతి విషయంలో అత్తగారు జోక్యం చేసుకోవం మీ భర్తకు ఇబ్బంది కలిగించక పోవచ్చు, కానీ మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయాన్నీ మీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. మీకంటూ కొంత దాపరికం ఉండాలి అని చెప్పండి. ముఖ్యంగా భవిష్యత్తుకి సంబందించిన విషయాలలో కొంత దాపరికం అవసరం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon