Link copied!
Sign in / Sign up
31
Shares

మార్కెట్ లో కెమికల్స్ ద్వారా పండిస్తున్న పిల్లల ప్రాణాలకు హానికరమైన పండ్లను గుర్తించడం ఎలా ?

పండ్లను అందరూ ప్రేమిస్తారు. మన మరియు పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పిల్లల ఎదుగుదలకు కావల్సిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్న పండ్లను ఇప్పుడు మనం కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం. కేవలం కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం, డబ్బు మీద ఆశతో, పండ్లను విషతుల్యం చేస్తున్నారు. పండ్లను పండించడానికి కొన్ని రకాల అత్యంత హానికరమైన కెమికల్స్ ను  వాడి అందరి ఆరోగ్యాలకు ముప్పు తెస్తున్నారు.

పండ్లను హానికరమైన కెమికల్స్ తో ఎలా పండిస్తున్నారు?

కాల్షియమ్ కార్బైడ్, ఇది ఒక కెమికల్. ఎరువుల్లో కలిపే కాల్షియమ్ సినమైడ్, అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేయడం కోసం, దీనిని ఫ్యాక్టరీలలో వాడుతారు. ఈ కాల్షియమ్ కార్బైడ్, నీటితో కలిసినప్పుడు హానికరమైన అసిటిలిన్ గ్యాస్గా (Acytlene gas) మారుతుంది. దీనిని పచ్చి పండ్లు త్వరగా పండిపోడానికి, వాటి మీద స్ప్రే చేస్తారు. ఇలా పండించిన పండ్లలో ఉండే, ఆర్సెనిక్ (Arsenic), ఫోస్ఫోరోస్ (Phosphorus) , మానవ శరీరంలో తీవ్రమైన దుష్పరిణామాలకు కారణం అవుతాయి.  ప్రెగ్నన్సీ మహిళలు ఈ పండ్లను తింటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది, ఈ పండ్లను తిన్న పిల్లలలో ఎదుగుదల లోపాలు ఉంటాయి.

మార్కెట్లో దొరికే హానికరమైన ఈ పండ్లను గుర్తించడం ఎలా?

చిట్కా 1: 

మీరు మార్కెట్లో పండ్లను కొనిన తరువాత, ఒక బక్కెట్ నీళ్ళలో వాటిని వేయండి. పండ్లు అడుగుకు మునిగిపోతే అవి సహజంగా పండించిన పండ్లు. ఒకవేళ అవి మునిగిపోకుండా, పైనే తేలుతుంటే అవి కెమికల్స్ ద్వారా పండించిన పండ్లని అర్ధం.

చిట్కా 2: 

కెమికల్స్ తో పండించిన పండ్ల రంగు, మొత్తం ఒకలా ఉండదు. అక్కడక్కడా పచ్చ రంగు ఉంటుంది. దీనికి కారణం వాళ్ళు చేసే స్ప్రే పండు మీద పూర్తిగా పడకపోవడం. సహజంగా పండిన పండ్లు ఎప్పుడు ఒకే రంగులో ఉంటాయి.

చిట్కా 3: 

మీరు మార్కెట్లో పండ్లను కొన్న తరువాత, పై చర్మం మీద చిన్నగా గీకండి. తెల్లని మైనం లాంటి పదార్ధం కనిపిస్తే, ఆ పండ్లను కొనకండి. అవి కెమికల్స్ తో పండించిన పండ్లు.

తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు

1.మార్కెట్లో కొన్న పండ్లను తినే ముందు, శుభ్రంగా నీటితో కడగండి.

2.వీలున్నంత వరకు, ఆర్గానిక్ షాప్స్ లేదా తోటల్లో దొరికే పండ్లను కొనండి.

దయచేసి అందరికి SHARE చేయండి. ఆరోగ్యాన్ని కాపాడండి!!!!!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon