Link copied!
Sign in / Sign up
0
Shares

‘మ్యాంగో లస్సీ’ ని 10 నిముషాలలో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి.. 👌👌

సమ్మర్ అంటే కేవలం భగభగమండే ఎండలే కాదు, తియ్యతియ్యని రుచికరమైన మామిడిపండ్ల సీజన్ కూడా. ఈ ఎండల తాకిడి బదులు ఏదైనా కాస్త చల్లచల్లని జ్యూస్ సేవిద్దాం అనుకునేవారు ఇంట్లో పదే పది నిముషాల్లో చేసుకోగల జ్యూస్ ‘మ్యాంగో లస్సీ’.  ఈ జ్యూస్ ను తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఇది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి.

‘మ్యాంగో లస్సీ’ కావలసిన పదార్థాలు :

మామిడిపండ్ల రసం - 3 కప్పులు

పెరుగు - ఒక కప్పు

చక్కర - ఒక కప్పు

యాలకుల పొడి - ఒక స్పూన్

‘మ్యాంగో లస్సీ’ ఎలా తయారు చేసుకోవాలి..!!

చల్లచల్లగా, తియ్యతియ్యగా మామిడిపండ్లతో మ్యాంగో లస్సీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడండి..

◼️ ముందుగా నాలుగు లేదా ఐదు మామిడిపండ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ మామిడిపండ్ల నుండి రసాన్ని తీసి ఒక గిన్నెలో ఉంచాలి.

◼️ పెరుగు మరియు చక్కరను ఫ్రూట్ జ్యూస్ లు తయారుచేసుకునే మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మామిడిపండ్ల రసాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.

◼️ ఇలా చేస్తున్నప్పుడు జ్యూస్ మాత్రమే కాకుండా కాస్త నీటిని చేర్చుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

◼️ మీరు వెంటనే సేవించాలి అనుకుంటే అందులో కాస్త ఐస్ వేసుకుని కలుపుకోవచ్చు. లేదా ఈ జ్యూస్ ను ఫ్రిడ్జ్ లో ఉంచుకుని ఒక గంట తర్వాత సేవించవచ్చు.

సో, చూశారు కదా ‘మ్యాంగో జ్యూస్’ ఎలా తయారుచేసుకోవచ్చో. ఈ ఇంటిల్లిపాదికీ ఇంట్లోనే ఇలా చేసి ఇవ్వండి. తప్పకుండా మెచ్చుకుంటారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon