Link copied!
Sign in / Sign up
0
Shares

మంగళవారం రోజు తప్పక చేయాల్సిన 3 పనులు : చేయకూడని పనులు

మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం అంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక వ్యతిరేకమైన ఫీలింగ్ ఉంది. ఈ రోజు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినా లేదా ఎక్కడికి వెళ్లాలనుకున్నా మంచిది కాదని అంటుంటారు. ఈ రోజు మంగళవారం కదా ఎందుకులే అని పెద్దలు కూడా మరో రోజు మొదలుపెట్టుకో ఏదైనా ఉంటే అని చెబుతూ ఉంటారు. ఇక ఊర్లలో అయితే మహిళలు ఎక్కడికైనా బయలుదేరాలి శుభకార్యాలకు వెళ్లాలనుకున్నప్పుడు మంగళవారం కదమ్మా వద్దులే అని చెబుతూ ఉంటారు. అసలు మంగళవారం ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇక్కడ చూడండి..

మంగళవారం చేయాల్సిన పనులు

మంగళవారానికి అధిపతి కుజుడు.. దీని కారణంగా ఈ రోజు ప్రమాదాలు, ఇబ్బందులు, లేనిపోని సమస్యలు కుజుడి వలన తలెత్తుతాయని మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని అంటుంటారు. అలాగే కుజుడికి అధిపతి సుబ్రమణ్యస్వామి. అసలు మంగళవారం ఏం చేయకూడదని మన పెద్దలు చెబుతున్నారు మీరే చూడండి..

◼️ గోర్లు కత్తిరించడం

◼️ అప్పులు చేయడం

◼️ శుభకార్యాలు మొదలు పెట్టడం

◼️ జుట్టు కత్తిరించుకోవడం

◼️ నూతన బట్టలు ధరించడం

◼️ కొత్త పనులు, ప్రయాణాలు పెట్టుకోవడం

◼️ ఇంటికి రంగులు వేయడం..

◼️ ఇంటి ఆడపడచును అత్తారింటికి పంపడం.. ఈ పనులను మంగళవారం రోజు చేయకూడదని మన పెద్దలు చెబుతున్నారు.

మంగళవారం రోజు చేయాల్సిన పనులు:

మంగళవారం రోజు ఏం చేస్తే మంచిది, ఏం చేయకూడదు అనే విషయాల గురించి చర్చించుకుంటున్నాం, ఇందులో ఈ రోజు ఏం చేయాలో ఇక్కడ చూడండి.

◼️ ఈ రోజు మీరు అప్పుగా తీసుకున్న డబ్బును లేదా ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకున్నా ఇవ్వవచ్చు. డబ్బు ఈ రోజు ఇస్తే మళ్ళీ తిరిగిరాదనేది అందరూ చెబుతున్నారు గానీ అందులో నిజం లేదు.

◼️ మీరు మీ పనిమీద వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు, మంగళవారం వెళితే పని జరగదు అనేది కొందరు వారికి జరిగిన అనుభవాల నుండి చెప్పిందే గానీ అందరికీ అలా జరుగుతుంది కాదని..

◼️ మంచి మనస్సుతో మంచి పని మొదలుపెట్టేటప్పుడు ఏ రోజు అనేది ముఖ్యం కాదు కదా.

◼️ ఈ రోజు హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు అని చెబుతారు కాబట్టి, దైవ భక్తి ఉన్నవారు ఆంజనేయస్వామిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం చేయవచ్చు.

మనం అందరం కష్టపడి మనకోసం, తర్వాత తరాల కోసం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ రోజు మంచిది, ఫలానా రోజు మంచిది కాదని చెప్పడం మంచిది కాదని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon