Link copied!
Sign in / Sign up
10
Shares

మందులు వాడకుండా పిల్లలలో జ్వరం ఎలా తగ్గించాలి..?

జలుబు, జ్వరం, దగ్గు..పిల్లలను ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన బాక్టీరియా త్వరగా వారి శరీరాన్ని చేరి అనారోగ్య సమస్యలకు దారి తీస్తూ ఉంటాయి. పిల్లల అనారోగ్యంగా ఉంటే వెంటనే ఉరుకుపరుగులతో హాస్పిటల్ కు వెళ్లడం చేస్తున్నారు తల్లితండ్రులు. ఐతే ఎక్కువగా మందులు తీసుకోవడం వలన పిల్లల శరీరానికి ఇబ్బందికరంగా ఉంటుంది.  అందుకని మందులు అవసరం లేకుండా జ్వరం బారిన నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకోండి..

కాళ్లకు సాక్స్

జ్వరంతో బాధపడుతున్నప్పుడు పిల్లలైనా, పెద్దలైనా సరే వారి కాళ్లకు చల్లని నీటితో తడిపిన కాటన్ సాక్స్ ధరించడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మాములుగా సాధారణ జ్వరం ఐతే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. జ్వరం తగ్గడానికి చేసే వాటిలో ఇది ఉత్తమమైనది. మరీ ఎక్కువ జ్వరం ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

ఆలివ్ ఆయిల్ మసాజ్

శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే జ్వరం అని అంటారు. ఇటువంటి ఉష్ణోగ్రత వెంటనే తగ్గాలంటే శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసి బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత కాటన్ దుస్తులు ధరించి ఒక పలుచటి దుప్పటిని కప్పుకుని విశ్రాంతి తీసుకోవాలి. రెండేళ్ల లోపు పిల్లలకు కూడా ఈ విధంగా చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేడి నీటితో స్నానం

గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వలన జ్వరంతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వలన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఉష్ణోగ్రత తగ్గుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు.

మెడ మరియు తలపై

సాధారణంగా ఇది ప్రతి ఒక్కరూ చేసేదే. శరీర వేడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా జ్వరంగా ఉన్నప్పుడు ఒక పలుచటి వస్త్రాన్ని చల్లని నీటిలో తడిపి, నీరు లేకుండా బాగా పిండి తల మరియు మెడ భాగాలలో వేయడం వలన శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గుతుంది.

తేనె

ప్రతి రోజూ ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనెను ఇవ్వడం వలన పిల్లలు మరియు పెద్దలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే నీటిని ఎక్కువగా, ద్రవ పదార్థాలను బాగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధులు  సోకకుండా కాపాడుకోవచ్చు.

ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను అందరికీ SHARE చేయగలరు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ ఏమంటారు ఫ్రెండ్స్.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon