Link copied!
Sign in / Sign up
142
Shares

మంచి తండ్రి అవ్వడానికి మీ భర్తకు ఉండాల్సిన 6 లక్షణాలు

మీ ఆయన మంచి భర్తేనా? ప్రతి మగవాడు మంచి భర్త కాలేడు. అలాగే ప్రతి భర్త మంచి తండ్రి అవ్వలేడు. పిల్లల పెంపకం కేవలం ఆడవాళ్ళ బాధ్యత కాదు, మీ పాత్ర ఎంత ఉందో, మీ భర్త పాత్ర కూడా అంతే ఉంది. కాని మీ భర్త, మంచి తండ్రి అవ్వడానికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం …

1. నిద్ర లేస్తాడా?

తెల్లవారు జామున 3 గంటలకి, పిల్లాడు ఏడుస్తున్నాడు. మీరు భారంగా నిద్ర లేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఏడుపు ఆగిపోయింది. చూస్తే మీ ఆయన మీకన్నా ముందే లేచి పిల్లాడ్ని లాలిస్తున్నాడు. ఇలా మీ ఆయన చేస్తే, … ‘మంచి తండ్రి’ అనే పరీక్షలో నూటి కి నూరు మార్కులు వచ్చినట్టే.

2. డైపర్ మారుస్తాడా?

పిల్లల బాధ్యతలలో, కడగడం తుడవడం మీ పని, ఎత్తుకుని ముద్దులు పెట్టడం మీ ఆయన పని. ఇలా బాధ్యతలు పంచుకుని, మీ ఆయన తప్పించుకుంటున్నాడా? లేదా  అన్ని తన బాధ్యత కూడా అనుకుని, పిల్లలకు డైపర్ మార్చడం, అప్పుడప్పుడు స్నానం చేయించడం లాంటివి చేస్తున్నాడా?  చేస్తే మీ ఆయన మంచి తండ్రి.

3. ప్రేమ మాత్రమేనా?

పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నామో…. ఆ ప్రేమనంతా వారి మీద చూపించడం మంచిదే. కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సినప్పుడు కటువుగా కూడా ఉండాలి. మీ  ఈ రెండిటిని సమానంగా నెరవేరిస్తే మీ ఆయన మంచి తండ్రి..

4.ఆడుకుంటాడా?

ప్రేమ బాధత్య కాదు నెరవేరిస్తే తీరిపోడానికి. మీ ఆయన పిల్లలతో ఆడుకుంటాడా? వాళ్ళను నవ్విస్తాడా? ఇవన్నీ ప్రేమ చూపించడంలో భాగమే.. మంచి ఏవి తప్పకుండా చేస్తాడు.

5.నిద్రపుచ్చుతాడా?

పిల్లలను సరైన సమయానికి నిద్రపుచ్చడం అంత సులువైన పని కాదు. ఈ బాధ్యతను మీతో పాటు మీ ఆయన కూడా పంచుకుంటాడా? పిల్లలకు కథలు చెప్పి, ఏదోటి చేసి పిల్లల్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నించాలి. అది మంచి తండ్రి లక్షణం.

6. కలిసి భోజనం చేస్తాడా?

పిల్లలు తమ నాన్నతో కలిసి తినడానికి ఇష్టపడుతారు . మీ పిల్లల ఇష్టాన్ని తీర్చడానికి మీ ఆయన ప్రయత్నిస్తాడా? రోజు తప్పకుండ పిల్లలతో కలిసి భోజనం చేస్తాడా? అలా చేస్తే మీ ఆయన మంచి తండ్రి.

ఈ లక్షణాలు మీ ఆయనకు తెలియాలంటే మీ ఆయనకు SHARE చేయండి 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon