Link copied!
Sign in / Sign up
3
Shares

మహిళలు చాలా ధైర్యవంతులు, గొప్పవాళ్ళు అని తెలిపే 5 నిజాలు..

స్త్రీ, మహిళ, ఆడది..ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా అందరినీ అమ్మ అనే ఒకే ఒక్క పిలుపు ద్వారా జీవితాంతం వీరికి రుణపడి ఉండేలా అనేలా చేస్తుంది. అందుకే మహిళలకు చేతులెత్తి మొక్కకపోయినా వారిని గౌరవంగా చూసుకోకపోయినా వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండటమే మీరు ఇచ్చే గొప్ప గౌరవ మర్యాదలని ఇప్పుడు అందరూ అంటున్నారు. అయితే మహిళలు కొన్ని కొన్ని విషయాలలో మగవారి కన్నా చాలా ధైర్యవంతులు, గొప్పవాళ్ళు అని తెలిపే కొన్ని సంఘటనలు నిజాలు ఇక్కడ చూద్దాం..

ఋతుక్రమం 

ఇది మహిళలకు వరమో శాపమో గానీ ప్రతి నెల వారి శరీరం నుండి కొద్దిమొత్తంలో రక్తం బయటకు వెళ్తూ ఉంటుంది. నెలసరి రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో కొందరికి నొప్పి కలిగితే మరికొందరికి ఎంతో బాధగా, వికారంగా మాటల్లో చెప్పుకోలేని విధంగా బాధిస్తూ ఉంటుంది. ఇదే మగవారికి ఒక్కసారి జరిగితే తట్టుకోవడం చాలా కష్టం, ఈ విషయంలో మహిళలు చాలా ధైర్యవంతులే కదా.

జన్మను ఇవ్వడం

సృష్టి కార్యమో, ధర్మమో ఏమో.. ఇలా ఎన్ని చెప్పుకున్న 9 నెలల పాటు బిడ్డను జాగ్రత్తగా కడుపులో దాచుకుని నెలలు నిండిన తర్వాత బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో భగవంతుడా, దేవుడా అని తలచుకుంటూ ప్రసవ వేదన, నొప్పులతో బిడ్డకు జన్మను ఇస్తారు. గౌరవప్రదమైన గర్భ స్థానం నుండి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనమందరం జీవితాంతం రుణపడి ఉండటానికి ఇంతకంటే ఏం కావాలి. అందుకే మహిళలు చాలా గొప్పవాళ్ళు.

పెళ్లి

అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు, అన్నతమ్ముళ్లు..ఇలా వీరందరితో దాదాపు 20, 25 ఏళ్ళ పాటు కలిసిమెలసి ఎన్నో మరపురాని తీపి గుర్తులను పంచుకుని పెళ్లి అనే బంధంతో మరొకరి జీవితంలోకి వెళ్లి నా అనుకునే వాళ్ళకు దూరంగా వచ్చేస్తారు. పెళ్లి తర్వాత ఎన్ని బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా తమలోతామే ఓదార్పు తెలుపుకుంటూ జీవిస్తారు. అందుకే మహిళలు చాలా ధైర్యవంతులు.

ఒంటరి పోరాటం

కట్టుకున్న భర్తకు ఏమైనా జరిగితే, ప్రపంచం అంతా భర్తకు వ్యతిరేకమైనా సరే, కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డ ఆపదలో ఉన్నా, అందరూ తప్పు చేశాడు అని నిందిస్తున్నా.. వారికి అండగా నిలబడి ఒంటరిగా పోరాడి వారికి ఓదార్పును ఇస్తుంది. అందుకేనేమో ‘నీకు భూదేవంత ఓపిక ఉందమ్మా’ అంటూ మహిళలను భూమాతతో పోల్చి చెబుతూ ఉంటారు.

అన్నీ తానై..

మన అందరి ఇంట్లో నాన్న పిల్లల భవిష్యత్, ఇంటికోసం ఎక్కువగా కష్టపడుతూ పోషిస్తూ ఉన్నారని అనుకుంటాం. అది నిజమే కానీ, నాన్నకంటే కాస్త ఎక్కువగానే ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే దాకా పిల్లలకు ఏం కావాలి, భర్త సంతోషం, ఇంట్లో పెద్దవాళ్ళ మంచి చెడు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ పనిచేస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయం చాలదా మహిళలు గొప్పవాళ్ళు, చాలా ధైర్యవంతులు అని చెప్పడానికి..

అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని తెలుపండి. మహిళల గొప్పదనాన్ని తెలియజేసే ఈ విషయాలను తెలియనివాళ్లకు తెలిసేలా చేయండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon