మహిళలో వచ్చే PCOD (Polycystic Ovarian Disease) అనే భయంకరమైన వ్యాధి : కారణాలు, లక్షణాలు, చికిత్స
PCOD లేదా PCOS వ్యాధి ఎక్కువ శాతం మహిళలలో చాలా తీవ్రమైన సమస్య. 12- 45 వయసులో ఎప్పుడైనా ఈ వ్యాధి రావచ్చు. భయంకరమైన ఈ వ్యాధి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
PCOD వ్యాధి కారణం ఏంటి?
మహిళలలోని అండాశయం, ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ అయిన ఈస్ట్రోజెన్ (estrogen), టెస్టోస్టెరోన్ (testosterone) లతో పాటు మేల్ సెక్స్ హార్మోన్స్ అయినా ఆండ్రోజెన్స్ (androgens) ని కూడా కొద్ది పాళ్ళలో విడుదల చేస్తుంది. ఇది సహజంగా అందరిలో జరుగుతుంది. మీ రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే అండాలని, ఈ హార్మోన్స్ నియంత్రిస్తాయి.
అయితే హార్మోన్స్ విడుదలలో సమతుల్యత కోల్పోయినప్పుడు PCOD వ్యాధి వస్తుంది. PCOD వ్యాధి ఉన్న మహిళలలో, మేల్ సెక్స్ హార్మోన్, ఆండ్రోజెన్ అధికంగా విడుదల అవుతుంది. దీని కారణంగా అండ ఉత్పత్తి ఆగిపోతుంది. మొటిమలు అధికంగా వస్తాయి, ముఖం, శరీరం మీద అవాంచిత రోమాలు వస్తాయి.
అండాశయంలో ఫోలికల్ (follicle) అనే సంచులు ఉంటాయి, వీటిలో అండ ఉత్పత్తి జరుగుతుంది. రుతుక్రమ సమయంలో ఇందులో నుంచి ఒకటి లేదా రెండు అండాలు విడుదల అవుతాయి. దీనిని ఒవ్యూలేషన్ (ovulation) అంటారు. PCOD ఉన్న మహిళలలో, ఫోలికల్ సంచులలో, అండాలు పరిపక్వత చెందవు. దీని కారణంగా అండ విడుదల ఆగిపోతుంది. బదులుగా అండాశయంలో చిన్న తిత్తులు ఏర్పడుతాయి. దీనిని పోలీసిస్టిక్ అండాశయం (Polycystic ovaries) అంటారు.
మహిళలో PCOD వంశపారంపర్యంగా వస్తుంది. డయాబెటిక్స్, పీరియడ్స్ లో లోపాలు కూడా PCOD కి కారణం కావచ్చు.
PCOD వ్యాధి లక్షణాలు
మొటిమలు ఎక్కువగా వస్తాయి.
బరువు పెరుగుతారు.
శరీరం, ముఖం మీద అవాంచిత రోమాలు వస్తాయి. చాతి, పొత్తి కడుపు మీద కూడా రోమాలు వస్తాయి.
తల మీద జుట్టు రాలిపోతింది.
పీరియడ్స్ సక్రమంగా రావు. కొంత మందిలో పూర్తిగా ఆగిపోతాయి.
సంతానోత్పత్తి అవకాశాలు తగ్గిపోతాయి.
డిప్రెషన్ కి గురవుతారు.
PCOD చికిత్స విధానాలు
గర్భ నిరోధక మాత్రలు - Birth control pills or progesterone pills
ఫిమేల్ సెక్స్ హార్మోన్ విడుదలను పెంచుతాయి
యాంటీ - ఆండ్రోజెన్ వైద్యం - Anti-androgen medications
మేల్ సెక్స్ హార్మోన్ విడుదలను తగ్గిస్తాయి.
లేసర్ ట్రీట్మెంట్ - Laser traetment
అవాంచిత రోమాలను తొలిగిస్తారు.
పెల్విక్ లాప్రోస్కోపీ - Pelvic laparoscopy
అండాశయం లోని కొంత భాగాన్ని తొలిగిస్తారు
చికిత్స లో భాగంగా.....,
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తారు.
మొటిమలు తగ్గిస్తారు
సంతోనోత్పతి అవకాశాలను పెంచుతారు.
పీరియడ్స్ ను క్రమబద్ధం చేస్తారు
PCOD, పూర్తి వివరాలు అందరికి చేరేలా తప్పకుండా SHARE చేయండి
