మహిళలలో నడుం నొప్పిని 10 నిముషాలలో తగ్గించే అద్భుత ఇంటి చిట్కాలు.. ఒక్కసారి ఇలా చేస్తే చాలు
మహిళలలను ఎక్కువగా ఇబ్బందిపెట్టే సమస్యలలో నడుం నొప్పి ఒక్కటి. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునేవరకు ఇంటి పనులతో బిజీగా ఉండే ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కుంటున్నవారే. అయితే నడుం నొప్పి మళ్ళీ జీవితంలో రాకుండా ఉండాలంటే మహిళలు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుండి వెంటనే బయటపడవచ్చు.
నువ్వుల నూనె, ఆవాల నూనె
రెండు స్పూన్ల ఆవాల నూనె మరియు నువ్వుల నూనె తీసుకుని గోరు వెచ్చగా వేడి చేసుకోవాలి. ఈ నూనె నడుముపై రాసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.
కొబ్బరి నూనె, కర్పూరం
కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కర్పూరం కలుపుకుని బాగా వేడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో ఉంచుకుని నిల్వఉంచుకోవచ్చు. నడుం నొప్పిగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రాసుకుని మర్దనా చేసుకుని పడుకుంటే రిలీఫ్ గా ఉంటుంది.
అల్లం రసం, పసుపు
ఒక అర గ్లాసులో అల్లం రసం తీసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని సేవించడం వలన నడుం నొప్పిని తక్షణమే దూరం చేస్తుంది. అలాగే జీర్ణప్రక్రియను మెరుగుపర్చడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
బియ్యంతో దూరం
ఒక క్లాత్ తీసుకుని అందులో కొన్ని బియ్యం వేసుకుని బిగుతుగా కట్టాలి. ఇలా చేసిన తర్వాత ఒవెన్ లేదా ఏదైనా పాత్రలో ఉంచి గోరు వెచ్చగా అయిన తర్వాత నడుంపై కాపడం పెట్టుకోవాలి. ఇలా చేస్తే నడుం నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
యూకలిఫ్టస్ ఆయిల్
ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో కొంత యూకలిఫ్టస్ ఆయిల్ వేసి స్నానం చేసినట్లయితే నడుం నొప్పి నుండి రిలీఫ్ గా ఉంటుంది.
అల్లం, తేనె
రెండు కప్పుల నీటిని తీసుకుని ఇందులో అల్లం ముక్కలను తరిగి వేసి బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టుకుని అందులో తేనె కలుపుకుని సేవించడం ద్వారా నడుం నొప్పి సమస్య ఉండదు. అలాగే అల్లంను పేస్ట్ గా చేసుకుని నడుంపై మర్దనాగా చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHAREచేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
