వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులతో బాధపడటం సహజమే కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది తక్కువ వయసులోనే ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. మగవారితో పోల్చితే మహిళలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయినట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి బయటపడవచ్చు.
పసుపు పాలు
ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని సేవించడం వలన మోకాళ్ళ నొప్పుల సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. మీరు తీసుకునే మందుల కంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా కావాలంటే పసుపును గోరువెచ్చగా కొబ్బరినూనెలో వేడిచేసి పడుకునేముందు రాసుకుని మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నువ్వుల నూనె వెల్లుల్లి
ఒక కప్పు నువ్వుల నూనె తీసుకుని, అందులో నాలుగు వెల్లుల్లిలను వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కిందకు దించి చల్లార్చాలి. చల్లారిన తర్వాత వడగట్టుకుని మోకాళ్ళపై మర్దనా చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉండవు.
ఉల్లిపాయ ఆవాలు
ఉల్లిపాయ ఆవాలను సమాన భాగాలుగా తీసుకుని బాగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళపై రాసుకుని మర్దనా చేసినా లేదా మోకాళ్ళపై ఉంచి ఒక క్లాత్ లేదా కవర్ కట్టి కొన్ని గంటల తర్వాత తీసివేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నీలగిరి తైలం
మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి నీలగిరి తైలం (యూకలిఫ్టస్ ఆయిల్) తో మసాజ్ చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చగా కాపడం పెట్టుకోవడమ్ వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
మెంతుల పొడి
ప్రతిరోజూ ఒక స్పూన్ మెంతుల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆలివ్ ఆయిల్
ఈ రెండిటినీ ఒక్కొక్క స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మోకాళ్ళపై మర్దనా చేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ ఆయుర్వేద చిట్కాలు మహిళలకే కాకుండా మగవారిలోనూ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి ఆయుర్వేద ఆహారాలు
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
