Link copied!
Sign in / Sign up
45
Shares

ఎలాంటి బానపొట్టను అయినా 7 రోజుల్లో 5 కేజీలు తగ్గించే బెస్ట్ జ్యూస్

ప్రస్తుతం ప్రతి ఒక్కరు అధిక బరువుతో బాధపడుతున్నవారే. ముఖ్యంగా పిల్లలకు జన్మను ఇచ్చిన తర్వాత, వయస్సు పెరిగే కొద్దీ మహిళలలో అధిక బరువు ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ చెప్పుకునే విధంగా చేయడం వలన వారం రోజుల్లోనే నాజూకుగా మీ శరీరాన్ని తీర్చి దిద్దుకోవచ్చు. ఈ సులభమైన ఇంటి చిట్కాను దయచేసి అందరికీ SHARE చేయగలరు..

బరువును తగ్గించే కొత్తిమీర జ్యూస్ :

వారం రోజుల్లో అధిక బరువు తగ్గి నాజూకుగా అందంగా కనిపించాలంటే ఈ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఇందుకు కావాల్సిన పదార్థాలు ముందుగా తెలుసుకోండి.

కొత్తిమీర

అల్లం

కీరదోసకాయ

ఒక నిమ్మకాయ

కొత్తిమీర జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి..?

ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని పొడిగా చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసుకుని, వెంటనే ఒక కీరదోసకాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఆ తర్వాత ఒక కొత్తిమీర కట్టను తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి.

ఈ పదార్థాలను కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ లోకి నీరు (గోరు వెచ్చగా ఉంటే మంచిది) తీసుకుని ఇందులో ఆ పదార్థాలన్నిటినీ కలుపుకుని మిక్సీలో వేసి మిశ్రమంగా అయ్యేలా చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను రాత్రి పడుకునేముందు 7 రోజుల పాటు సేవించడం వలన ఒక వారం రోజుల్లో బరువు తగ్గి నాజూకుగా ఉంటారు. ఈ జ్యూస్ ను ముందే తయారుచేసుకుని ఫ్రిజ్ లో కూడా ఉంచుకోవచ్చు. స్వీట్స్, ఫ్యాట్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

గమనిక : అలర్జీ సమస్య ఉన్నవారు, గర్భిణీ మహిళలు, కొన్ని రోజుల క్రితం గర్భం దాల్చిన వారు ఈ జ్యూస్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు.

ఉసిరి రసం

తాజా ఉసిరి కాయలను కొన్ని తీసుకుని వీటి నుండి ద్రవం బయటకు వచ్చేలా రుబ్బుకోవడం లేదా మిక్స్ చేయడం చేయాలి. ఈ ఉసిరి ద్రవాన్ని ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సేవించడం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు.

జీలకర్ర, నీరు

శరీరంలోని అనవసరపు కొవ్వును దూరం చేసే మరొక అద్భుతమైన పదార్థం జీలకర్ర. ఒక గ్లాస్ నీటిలో చిటికెడు జీలకర్ర పొడి కలిపి బాగా మరిగించాలి. మరిగిన ఈ ద్రవాన్ని కొద్దిసేపు చల్లార్చి, ఆ తర్వాత సేవించాలి. ఇలా రోజులో మూడు పూటలా సేవించడం వలన శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు దూరమవుతుంది. పైన చెప్పుకున్న కొత్తిమీర జ్యూస్ ఎలా తయారుచేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

Video Credits : Food Lovers

మీ స్నేహితులకు మరియు ప్రతి మహిళకు ఈ సమాచారం తెలిసేలా SHARE చేయాలి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon