Link copied!
Sign in / Sign up
121
Shares

మహిళలకు ఉండే 5 అందమైన కోరికలు : మీలో ఎంతమందికి ఇవి తెలుసు...

మహిళలకు ఊహాజనకమైన కోరికలు ఉంటాయని అందరూ అంటుంటారు. అదే నిజమో కాదో గానీ కొన్ని కోరికలను మాత్రం బాగా ఇష్టంగా కోరుకుంటారట. తమకు ఇష్టమైన ఆ పని కోసం ఎంత కష్టపడటానికైనా సరే సిద్ధంగా ఉంటారట. ఈ విషయాలు తమ భర్తలకు కూడా చెప్పారని, భర్తతో చెప్పాల్సిన విషయం అయితేనే ఆ కోరికను వాళ్లకు చెబుతారని అంటున్నారు. ఇంతకీ ఆ పనులేంటో మీరే చూడండి..

నేను కోరుకునేలా నా ఇల్లు, పిల్లలు ఉండాలి 

ప్రతి మహిళ పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా తన భర్త గురించే ఆలోచిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత వారే లోకంగా, వారి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటుంది. అలా మహిళలు కోరుకునే విషయాలలో అతి పెద్ద కోరిక ఏంటంటే.. మాకు సొంత ఇల్లు ఉండాలి, నా భర్త పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటుంది. ఇది ఇతరులకు చిన్న విషయం కావచ్చు గానీ మహిళలకు మాత్రం ఇదే పెద్ద కోరిక. మహిళలు నిజమా, కాదా మీరే చెప్పండి.

అప్పుడు నా భర్త పక్కనే ఉండాలి 

మహిళలు పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా ఆనందపడే క్షణాలు గర్భం దాల్చి అమ్మను కాబోతున్నాను అని తెలిసినప్పుడు. అప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు నా భర్త నా పక్కనే ఉండాలి. నాకు ఏం కావాలో తనే దగ్గరుండి చూసుకోవాలి, నాకు ఎటువంటి భయం లేకుండా ధైర్యాన్ని ఇవ్వాలని మహిళలు కోరుకుంటారు. ఈ సమయంలో భార్య పక్కనే భర్తలు ఉండటం వలన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేరు, మా ఆయన చాలా మంచివారు గొప్పవారంటూ అందరితో చెప్పుకుంటారు. నిజమే కదా !

వస్తువులు 

మహిళలకు సాధారణంగా దుస్తులు, బంగారం అంటే ఇష్టమేనని అందరికీ తెలిసిందే. వాళ్లకు ఫలానా ఆభరణాలు నచ్చితే నాకు ఆ నగలు కావాలని భర్తను ప్రేమగా అడిగి కొనిపించుకుంటారు. అదే భర్త గనుక తమ ఆర్ధిక పరిస్థితి చెబుతూ ఇప్పుడు వద్దులే అని దాటవేసారు అనుకోండి, తాము దాచుకున్న డబ్బును ఇచ్చి మరీ పదండీ షాపింగ్ కు వెళ్దాం అని భర్తను వెంటను తీసుకువెళతారు. ఎందుకంటే మహిళలకు నగలు అంటే చాలా ఇష్టం కాబట్టి..

ఉద్యోగం మరియు నచ్చిన పని 

మహిళలకు చిన్నప్పటి నుంచి మదిలో కొన్ని అందమైన కోరికలు ఉంటాయి. అలా ఉండాలి, ఇది చేయాలని ఎంతో బలంగా కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకునే వాటిలో ఉద్యోగం చేయాలని. అది పెళ్ళికి ముందైనా సరే, పెళ్లి తర్వాత అయినా సరే. పెళ్లి తర్వాత అయితే తన భర్త ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని కోరుకుంటారు. ఉద్యోగం చేయని మహిళలు ఏదైనా ఇతర మహిళలకు ఉపయోగపడేలా ఉపాధి కల్పిస్తూ బిజినెస్ వంటివి చేయాలని, ఇంట్లో ఖాళీగా వంటింటికి మాత్రమే పరిమితం కాకూడదని అనుకుంటారు. నిజమే కదా మహిళలు..

ఇష్టమైన ప్లేస్ 

చిన్నప్పటి నుండి ఆడపిల్లలు అనే కారణంగా చాలామంది ఇళ్లలో తమ పిల్లలను ఎక్కడికీ వెళ్లనివ్వరు. తల్లితండ్రులుగా వారి భయం వారిది. అయితే కొన్ని కొన్ని టూరిజం ప్లేసెస్ కు వెళ్లాలని ప్రతి మహిళకు ఉంటుంది కదా. కుటుంబంతో లేదా పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిస్ అయినా సరే తమకు నచ్చిన ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత హమ్మయ్య ఎన్నో రోజులుగా ఇక్కడికి రావాలనుకుంటున్నాను ఇప్పటికి వచ్చాను, అది మీ వల్లే అంటూ భర్తతో ఆనందంగా చెబుతారు. ఇలా మీ భర్తతో లేదా కుటుంబంతో కలిసి మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళారా..!

ఇవండీ దాదాపు ప్రతి మహిళకు ఉండే అందమైన కోరికలు. ఇది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, ఇందులో కరెక్ట్ అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోకండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon