Link copied!
Sign in / Sign up
0
Shares

మహిళలకు ఈ 5 రకాల వ్యక్తులంటే చాలా ఇష్టం : మగవాళ్ల గురించి తప్పక తెలుసుకోండి..

ఒక వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు, అలా అమ్మాయిలు కూడా తమకు నచ్చేవారిలో ఈ క్వాలిటీస్ ఉండాలని కొన్ని కండీషన్స్ పెట్టుకోవడం సాధారణమే. తమ జీవితంలోకి నచ్చిన వ్యక్తి వచ్చినప్పుడే కదా, వారు సంతోషంగా ఉండేది. ఇక్కడ అదే విషయాన్ని మీకు చెప్పేబోతున్నాం . ఒక సర్వే ప్రకారం ఎక్కువమంది మహిళలు చెప్పిన టాప్ సమాధానాలలో మహిళలకు ఈ రకాల వ్యక్తులంటే చాలా ఇష్టమట. అదేంటో మీరే చూడండి..

తెలివైనవాడు

తమని ప్రేమించేవాడు లేదా తన జీవిత భాగస్వామి చాలా తెలివైనవాడై ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుందట. బాగా తెలివైనవారితైనా తమకి ఏం కావాలో ముందే తెలుసుకోవడం చేస్తాడని, తనని బాగా చూసుకుంటాడని, మంచిగా అర్థం చేసుకుంటారని అంటున్నారు. ఎవరైనా తన భర్త తెలివి తక్కువ వాడు, ఏమీ తెలియని వెర్రి వాడంటే మహిళలకు చాలా కోపం వస్తుంది.

క్రియేటివ్ గా ఉండాలి

మహిళలకు ఎప్పుడు ఒకేలా ఉండటం అంటే చాలా బోర్ గా ఫీలవుతారట. కొత్తగా ఉండటం, క్రియేటివ్ గా ఆలోచించడం, భార్య ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ అయ్యేలా కళాత్మకంగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారట. ఇలాంటి వారికైతే సమాజంలోనూ మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని ఏదైనా సరే వీళ్ళు సాధించగలరని వీరికి చాలా నమ్మకం.

నమ్మకస్తులు

మహిళలు ఎప్పటికీ తమతో నమ్మకంగా ఉండే ప్రియుడు లేదా భర్త తమకు జీవిత భాగస్వామి అయితే బాగుండు అని కోరుకుంటారు. ఇలాంటి వారినే ఎక్కువగా ఇష్టపడతారు కూడా. ఎందుకంటే తనతో పాటూ ఉండేవారే, తనని బాగా అర్థం చేసుకున్నవారే అపార్థం చేసుకుని, అనుమానించి, అవమానిస్తే అస్సలు తట్టుకోలేరు. నమ్మకంగా ఉండేవారంటే వారిని ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారు.

ఫన్, రొమాంటిక్

లైఫ్ లో ఎప్పుడు సీరియస్ గా ఉంటూ, ఒకే విధంగా ఉండటం అంటే మహిళలు చాలా చిరాకుగా ఫీలవుతారట. కొంచెం ప్రేమ, ఆప్యాయతతో పాటు నవ్విస్తూ ఉండటం, రొమాంటిక్ గా ఉండేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. బయటకు రొమాంటిక్ గా ఉండాలని చెప్పలేకపోయినా, జోక్స్ వేస్తూ నవ్వించేవాళ్ళు అయితే సంతోషపడతారు.

బాధ్యతగా ఉండాలి
మహిళలు డబ్బు బాగా సంపాదించే వ్యక్తులనే ఇష్టపడతారు అనుకోవడం చాలా పొరపాటు. డబ్బే అవసరం లేదు తనతో పాటు తన భాగస్వామి అయిన భార్యను, పిల్లలను, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే వ్యక్తి అంటే వారికి చాలా విలువను ఇస్తారట. అటువంటి వ్యక్తులను మహిళల నుండి విలువైన గౌరవం, మర్యాద అంతకుమించిన ప్రేమ, ఆప్యాయతలు దక్కుతాయట.

మరి మీకు నచ్చిన వ్యక్తి లేదా మీ భాగస్వామిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయని అనుకున్నవాళ్ళు ఇది షేర్ చేయండి లేదా కామెంట్ చేయండి.. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon