Link copied!
Sign in / Sign up
2
Shares

మహిళల ప్రైవేట్ పార్ట్స్ లో నల్లని మచ్చలు, మొటిమలు ఎందుకు వస్తాయి : ఇలా చేస్తే తగ్గిపోతాయి

మహిళలు ప్రతి ఒక్క విషయాన్ని అందరితో చెప్పుకోలేరు, ముఖ్యంగా తమ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఐతే ఏ ఒక్కరితోనూ చెప్పుకోలేక,  ఎలా చెప్పాలో అర్థం కాక తమలో తామే బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో మహిళల ప్రైవేట్ పార్ట్స్ లో వచ్చే మొటిమలు, నల్లగా కందిపోయినట్లు ఉండే దద్దుర్లు. ఈ మొటిమలు రావడానికి కారణాలు ఏంటి? ఎలా చేస్తే తగ్గిపోతాయో ఇక్కడ తెలుసుకోండి.. 

చర్మం నుండి విడుదలయ్యే ఆయిల్..

సాధారణంగా ముఖంపై మొటిమలు వస్తూ ఉంటే వివిధ రకాల సోప్స్ వాడటం వలన, ముఖంపై క్రీమ్స్ అప్లై చేయడం వలనేమో అనుకుంటూ ఉంటారు. అసలు కారణం ఏమిటంటే చర్మం నుండి ఎక్కువగా విడుదలయ్యే ఆయిల్ కారణంగా ప్రైవేట్ పార్ట్స్ లో మొటిమలు వస్తాయి. ఇవి గిల్లకపోయినా సరే చర్మం రాసుకోవడం వలన పగిలిపోయి ఆ భాగం అంతా నల్లగా మారిపోతుంది. మంట కలగడం, దద్దుర్లుగా ఉండటం, మచ్చలా ఏర్పడటం జరుగుతుంది.

ప్రైవేట్ పార్ట్స్ లో మొటిమలు రావడానికి కారణాలు

మగవారికైనా, ఆడవారికైనా సరే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. మహిళలలో ఐతే పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ మార్చినప్పుడు, వేసుకునే లో దుస్తులు సరిగ్గా ఉతక్కపోవడం వలన, కండోమ్స్, వాడే సబ్బులు, టవల్స్, అక్కడ క్రీమ్స్ పౌడర్లు అప్లై చేయడం వలన, రక్తస్రావం కారణంగా మొటిమలు, నల్లని మచ్చలు, చర్మం కమిలిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..

ఈ నొప్పి తగ్గడానికి ఏం చేయాలి?

నిజానికి ఇది చాలా చిన్న సమస్యే కానీ ఎక్కువగా బాధిస్తుంది. ఐతే త్వరగా తగ్గిపోతుంది కూడా. అందుకని మంచి సబ్బులు ఉపయోగించడం, ఎక్కువగా ఆ ప్లేస్ లో ఇబ్బంది కలగకుండా రాసుకోవడం, చేతులను ఎప్పుడు అక్కడ ఉంచకుండా, పొడిగా ఉండే టవల్స్ వాడటం చేయాలి. అలాగే టీ ట్రీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, లావెండర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన నొప్పి, మంట తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

మహిళలు బయటకు చెప్పుకోలేని ఈ సమస్య గురించి అందరికీ తెలిసేలా చేయండి. ప్రతి ఒక్కరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon