Link copied!
Sign in / Sign up
48
Shares

మహిళల అందమైన మెడ, వీపు కోసం 3 అద్భుత ఇంటి చిట్కాలు

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో తప్పేమీ లేదు. ఐతే కొన్ని కొన్ని భాగాలలో శరీరంపై నలుపుదనం అప్పటికప్పుడు తొలగిపోవడం,  మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో మెడ, వీపు భాగం. మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని కొంతమంది ద్వారా తేలిన విషయం. కాబట్టి, ఇక్కడ చెప్పుకునే సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వడం వలన అందమైన మెడ, వీపు మీ సొంతం…

చక్కర మరియు ఎర్ర కందిపప్పు

సూర్యరశ్మి కారణంగా నల్లగా మారిన మెడ, వీపు భాగాలను అందంగా మార్చుకోవడానికి సహజసిద్ధంగా మన ఇంట్లో లభించే ఈ పదార్థాలను ముందు సేకరించుకుని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు :

చక్కర, ఎర్ర కందిపప్పు, కాఫీ పౌడర్, తేనె, ఆల్మండ్ ఆయిల్, నార్మల్ ఆయిల్ లేదా ఆరంజ్ ఎస్సెన్షియల్ ఆయిల్ (లెమన్ ఆయిల్).

ఎలా వాడాలి :

⇛ ముందుగా అరకప్పు ఎర్ర కందిపప్పు తీసుకుని మిక్సి పట్టి పొడిగా చేసుకోవాలి.

⇛ అరకప్పు చక్కరలో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మరియు తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి. అందులో ఆరంజ్ ఎస్సెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసి బాగా కలుపుకోవాలి.

⇛ ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న మెడ, వీపు భాగాలపై రాసుకుని 3 నిముషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. మెడ, వీపుపైనే కాకుండా నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లపై కూడా రాసుకోవచ్చు.

పాల మీగడ, శనగపిండి

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని అందులో పాల మీగడ కలిపి బాగా మిక్స్ చేసుకుని నల్లగా ఉన్న మెడ, వీపుపై రాసుకుంటే నలుపుదనం తగ్గిపోయి అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది.

బొప్పాయి

ఎస్..ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం నలుపు మెడ, వీపుతో బాధపడుతున్న వారు బొప్పాయిని గుజ్జుగా చేసుకుని, ఈ గుజ్జును మెడ భాగంలో రాసుకుని చల్లని నీటితో కొన్ని నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఏవైనా అనుమానాలు ఉంటే ఈ వీడియో ప్రకారం ఫాలో అవ్వండి. అందరికీ SHARE చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon