Link copied!
Sign in / Sign up
181
Shares

మహిళల చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించేందుకు 5 మార్గాలు

image source : Good Free Photos. com

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంలో తప్పేమీ లేదు. ముఖ్యంగా మహిళలు తమ చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సహజంగా అందంగానే ఉన్నా మరింత అందంగా కనిపించేందుకు మార్కెట్ లో వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. వీటివలన అప్పటికప్పుడు అందంగా మీ శరీరం మెరుస్తున్నా, ఆ తర్వాత ముఖంపై మచ్చలు, చర్మంపై దద్దుర్లు కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచడానికి ఇక్కడ చెప్పుకునే సహజ చిట్కాలను ఫాలో అవ్వడం వలన ఎప్పటికీ అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు. అలా కనిపించాలంటే ఏం చేయాలో ఇక్కడ వివరంగా మీకోసం…

1. ఫేస్ ప్యాక్

2. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోవడానికి

3. అందాన్నిపెంచే ఆయుర్వేద చిట్కాలు

4. ముఖంపై జిడ్డు ట్యాన్ తొలగించుకోవడానికి

5. అందమైన కాంతివంతమైన చర్మం కోసం

పైన చెప్పుకున్నట్లుగా మీ చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించాలంటే సహజంగా ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, ముఖంపై నల్లని మచ్చలను మొటిమలను తొలగించుకోవడానికి ఏం చేయాలి? ఇలా స్టెప్ బై స్టెప్ మీకోసం..

1. ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్ అనగానే చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేసుకుంటూ ఉంటారు. అయితే సహజమైన పాలు, లెమన్, అలోవెరా జెల్, పసుపు..వీటిని ఉపయీగించి మీ చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుకోవచ్చు.

పసుపుతో నిగనిగలాడే చర్మం - కావలసిన పదార్థాలు :

ముల్తాన్ మట్టి - 2 స్పూన్లు

పెరుగు - ఒక స్పూన్

అలోవెరా జెల్ - ఒక స్పూన్

పసుపు - అర స్పూన్

పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా..?

ముల్తాన్ మట్టి, పెరుగు, అలోవెరా జెల్ మరియు పసుపు వీటిన్నటిని పైన చెప్పుకున్నట్లుగా బాగా కలుపుకుని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. 20 నిముషాలు గడిచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవడం వలన ముఖంపై ఉన్నటువంటి జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

పసుపు మాత్రమే కాకుండా సహజంగా లభించే పాలు, తేనెతో మీ చర్మ సౌందర్యాన్ని రెండింతలు పెంచుకోవాలంటే ఎలాగో చూడండి. మీ అందాన్ని రెండింతలు పెంచే ‘పాల ఫేస్ ప్యాక్’ ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.. 

2. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోవడానికి

యుక్త వయస్సులో ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణమే కానీ, కొన్నిసార్లు దుమ్ము, ధూళి కారణంగా, వివిధ రకాల సబ్బులు మరియు క్రీములు వాడినప్పుడు ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు అందం దెబ్బతినడమే కాకుండా చిరాకుగా ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సులువైన సహజ చిట్కాల ద్వారా ఎటువంటి మచ్చలు లేని అందమైన చర్మాన్ని మీరు పొందవచ్చు.

మచ్చలు, మొటిమలు తొలగించడానికి కావలసిన పదార్థాలు :

పెరుగు - రెండు స్పూన్లు

పసుపు - ఒక స్పూన్

రోజ్ వాటర్ - ఓకే స్పూన్

పసుపు - ఒక స్పూన్

ఎలా అప్లై చేసుకోవాలి..?

పైన చెప్పుకున్న పదార్థాలను అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కాటన్ లేదా చేతితో ముఖానికి రాసుకుని 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలు మరియు మొటిమలు తొలగిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ టోన్ మరింత కాంతివంతంగా అందంగా మెరిసిపోతుంది.

3.అందాన్నిపెంచే ఆయుర్వేద చిట్కాలు

ప్రస్తుతం అంటే అందరూ కెమికల్ ప్రాడక్ట్స్, సోప్స్, క్రీములు వాడుతున్నారు కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు ఎక్కువగా సహజంగా లభించే పదార్థాల ద్వారానే తమ అందాన్ని కాపాడుకునేవారు. వయస్సు పెరుగుతున్నా కూడా వారు నిత్యయవ్వనంగా కనిపించడానికి వారు ఫాలో అయిన ఈ చిట్కాలే అసలు కారణం. అవేంటో మీరూ తెలుసుకోండి.

చర్మం పొడిబారకుండా..

చాలామంది చర్మం వెంటనే పొడిబారుతూ ఉండటం జరుగుతుంటుంది. దీనికి కారణం తీసుకునే ఆహారంతో పాటు, సరైన నిద్ర, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం..ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. పొడిబారిన చర్మం నుండి రిలీఫ్ ఇవ్వడమే కాకుండా మీ స్కిన్ టోన్ ను పెంచే ఈ చిట్కా వలన అందమైన శరీరం మీ సొంతం..

వేప మరియు పెరుగుతో

ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కాసిన్ని వేప ఆకులను చిన్నని ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముఖానికి రాసుకుని 20 నిముషాల తర్వాత శుభ్రంగా చల్లని నీటితో కడిగేసుకోవడం వలన ముఖం తేమగా ఉంటుంది మరియు అందంగా కూడా. ఇంకా మన పెద్దలు, అమ్మమ్మలు ఫాలో అయిన అప్పటి ఆయుర్వేద రహస్యాలు గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి. అందాన్ని పెంచే ఆయుర్వేద రహస్యాలు 

4.ముఖంపై జిడ్డు, ట్యాన్ తొలగించడానికి

ఎండలో తిరిగి బయటకు వచ్చినప్పుడు, పొల్యూషన్ కారణంగా, సరైన నిద్ర లేకపోవడం మరియు ఒత్తిడి కారణంగా కొందరిలో ముఖం ఎప్పుడూ పొడిగా ఉండటం, ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా సరే జిడ్డుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పుకునే ఈ సహజ చిట్కాలను ఫాలో అయినట్లైతే మీ ముఖంపై ఉన్నటువంటి జిడ్డును వెంటనే తొలగించుకోవచ్చు.

జిడ్డు తొలగిపోవడానికి ఏం చేయాలి?

ముఖం జిడ్డుగా ఉండటం అందరిలో కలిసి తిరగడానికి చాలామంది కాస్త ఆందోళనపడుతూ ఉంటారు. అందుకని 2 స్పూన్ల ముల్తానీ మట్టి, 1 స్పూన్ నిమ్మరసం (నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు), 1 స్పూన్ రోస్ వాటర్ (రోస్ వాటర్ ఉపయోగాలు) తీసుకోవాలి. 

వీటిని బాగా మిక్స్ చేసుకుని ముఖంపై అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో రోజుకొకసారి క్లీన్ చేసుకుంటే ముఖంపై ఉన్నటువంటి జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే ఇంకా పొడి బారిన చర్మం, సున్నితమైన చర్మం, ట్యాన్ తొలగించుకోడానికి సులువైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. అన్ని రకాల ముఖాలను అందంగా ఉంచే అద్భుత చిట్కాలు

5. అందమైన కాంతివంతమైన చర్మం కోసం

మీ చర్మం ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే పైన చెప్పుకున్నటువంటి సహజ చిట్కాలను ఫాలో అవ్వండి. ఇలా సహజంగా చిట్కాలను ఫాలో అవ్వడమే కాకుండా సరైన సమయానికి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నటువంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం, ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు ముఖానికి అడ్డుగా ఖర్చీప్ ఉపయీగించడం, గొడుగు కింద నడవటం, నీరు మరియు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చేయాలి. అలాగే కెమికల్స్ ఉపయీగించినటువంటి క్రీములు, సబ్బులు వాడకుండా సహజమైన ఈ పదార్థాలను ఉపయోగించడం చాలా ఉత్తమం. పైన చెప్పుకున్నట్లుగా చేసినట్లయితే తక్కువ టైంలోనే మీ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిసేలా ఉంచుకోవచ్చు.

ఈ చిట్కాలు అందరికీ ఉపయోగకరం అనిపిస్తే షేర్ చేయండి. ఈ ఆర్టికల్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలుపవచ్చు.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon