అధిక బరువుతో బాధపడుతున్నారా..! 7 రోజుల్లో 3 కేజీలు తగ్గించే ఒకే ఒక చిట్కా..
మహిళలు చూడటానికి చాలా అందంగా, ఆకర్షవంతంగా ఉన్నా కూడా, వారిలో అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందరితో కలిసి బయటకు వెళ్ళడానికి, ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. పెళ్లి తర్వాత, పిల్లలకు జన్మను ఇచ్చిన తర్వాత తమకు తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటారు. ఐతే ఇక్కడ చెప్పుకునే ఈ చిట్కాలను ఫాలో అవ్వడం వలన మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా ఇంటి వద్దే కరిగించుకోవచ్చు.
దాల్చిన చెక్క పొడి

ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ వేడి నీరు. ముందుగా దాల్చిన చెక్క పొడిని గ్లాస్ వేడి నీటిలో వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల తేనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో అర గ్లాస్, రాత్రి పడుకునే ముందు అర గ్లాస్ చొప్పున తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
నిమ్మరసం

ఇదివరకే చాలామంది మహిళలకు ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్లు లేదా సగం నిమ్మకాయ రసం గ్లాస్ నీటిలో వేసుకుని, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో మరియు భోజనం చేసిన తరవాత తీసుకుంటే బరువు పెరగకుండా స్లిమ్ గా ఉంచుతుంది. అల్లం టీతో సులువుగా బరువు ఎలా తగ్గవచ్చో ఇక్కడ తెలుసుకోండి..
ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని ఉదయాన్నే సేవించడం వలన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వుని తగ్గించివేస్తుంది. అలాగే అవకాడో, వెల్లుల్లి ప్రతి రోజూ తీసుకోవడం వలన పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా కాపాడుతుంది.
ఎలాంటి ఎక్సర్ సైజ్ లేకుండా బరువు తగ్గాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలు..
Video Credits : Your Health
