Link copied!
Sign in / Sign up
6
Shares

మగవారికి భార్యలపై శృంగార కోరికలు తగ్గడానికి కారణాలు

పెళ్ళైన దంపతులలో కొంతమంది భర్తలు కొన్నేళ్ల తర్వాత తమ భార్యలతో శృంగారం చేయడానికి అయిష్టం చూపుతుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మహిళలకు అర్థం కాదు. మగవారు కూడా చెప్పలేరు. ఈ విషయంలో తప్పు ఎవరిది అని తెలుసుకోవడం కన్నా శృంగార కోరికలు తగ్గడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.

పడకగదిలో ఇష్టం చూపించకపోవడం

కోరికలు అనేవి మగ,ఆడ ఇద్దరిలో సమానమే, కానీ శృంగారంపై ఆసక్తి కలిగిన ప్రతిసారీ భర్తలే అడగటం, బ్రతిమాలడం చేస్తున్నా తమ భార్యలు త్వరగా అంగీకరించకపోవడం, అయిష్టతగా ఉండటం వలన వీరికి శృంగారం అంటే ఇంట్రెస్ట్ తగ్గిందనుకుని చిరాకు, కోపంతో శృంగారానికి దూరంగా ఉంటారు.

అనారోగ్యం

కొంతమంది మహిళలకు వయస్సు పెరిగేకొద్దీ డయాబెటిస్, రక్తపోటు..వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి కారణంగా ఏ పనినీ ఇష్టంగా చేయలేరు. కొద్దిసేపటికే అలసిపోయినట్లుగా, నీరసంగా ఉంటారు. దీనివలన మగవారికి మిమ్మల్ని చూడగానే ఈ రోజు ఎందుకులే అని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనటం మంచిది కాదు.

బయటి విషయాలు పడకగదిలో

ఎక్కడో జరిగిన విషయాలు, ఆర్ధిక విషయాలు, వేరేవాళ్ళ సమస్యలు పడకగదిలో మీ భర్త శృంగారానికి ఆసక్తిగా ఉన్నప్పుడు గుర్తుచేయడం వలన మీ ఆయనకు అప్పటివరకు ఉన్న ఇష్టం తగ్గిపోతుంది. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడకండి. శృంగారం అనేది ఇష్టంగా, ఆనందంగా చేయాల్సిన ప్రక్రియ. పిల్లలు పుట్టాక వారితోనే గడపడం మీ ఆయనను అస్సలు పట్టించుకోకపోవడం. 

ఎక్కువసేపు ఎదురుచూసేలా చేయకండి

దంపతుల మధ్య ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచేది అందమైన రతిక్రీడ. మీ భర్త పడకగదిలో ఎదురుచూస్తున్నప్పుడు వాళ్ళను కొద్దిసేపు ఎదురుచూసేలా చేసుకోవడం వలన మీపై ప్రేమ, ఇష్టం పెరుగుతుంది. కానీ ఆ పని ఉంది, కొద్దిసేపు ఆగండి, ఈ రోజు మనం కలవకూడదు వంటి మాటలు చెప్పి వారికి విసుగు తెప్పించకూడదు. ఇష్టం లేకుంటే ముందే చెప్పడం వలన వారు అర్థం చేసుకోగలరు.

టచ్ చేస్తానే దూరంగా వెళ్లిపోవడం

ప్రతి భార్య తన భర్త తనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతుంది. అటువంటప్పుడు మీ భర్త మీపై చేతులు వేస్తున్నప్పుడు కొద్దిగా దూరంగా వెళ్తూ పరిహాసం చెయ్యొచ్చు. కానీ ప్రతిసారీ ఇలా చేయడం వలన తర్వాత మీరే ఇబ్బందిపడాల్సి వస్తుంది. బయట విషయాలతో సతమయి ఇంటికి వచ్చే మీ భర్తను సంతోషపరిచేది, రిలీఫ్ ఇచ్చేది మీరే అని గుర్తుపెట్టుకోండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHAREచేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పెళ్లి తర్వాత దంపతులు ఈ 5 రకాలుగా ఉంటారు : మీరు ఏ రకమో తెలుసుకోండి..! 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon