Link copied!
Sign in / Sign up
1
Shares

మగవాళ్ళను భార్యలు ఎలా పిలిస్తే వారికి గౌరవం..

భార్యభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. ఇష్టాఅయిష్టాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆలోచనలు ఇలా వేరు వేరు ఉన్న ఇద్దరు వ్యక్తులను పెళ్లి అనే అందమైన బంధం ద్వారా ఒక్కటవుతారు. అయితే పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య గౌరవం చాలా బాగుటుంది. ఏళ్ళు గడిచేకొద్దీ వారి మధ్య స్నేహం, చనువు పెరగడం వలన ప్రేమతో పిలిచినా, పిలవటం మాత్రం విభిన్నంగా పిలుస్తూ ఉంటారు. అయితే అందరూ ఉన్నప్పుడు భర్తను భార్య ఎలా పిలవాలో ఇక్కడ తెలుసుకోండి..

ఏమండీ..

పదిమందిలో లేదా మీ అత్తమామలు గానీ మీ అమ్మానాన్నలు గానీ మీ చుట్టూ ఉన్నప్పుడు ఏమండీ, ఏవండీ అని గౌరవంగా పిలవడం చేయాలి. అలా కాకుండా పేరు పెట్టి పిలవడం, వస్తారా లేదా ఏం చేస్తున్నారు అంటూ మర్యాద లేకుండా పిలిస్తే మీ ఆయన గౌరవాన్ని మీ వాళ్ళ ముందు తగ్గించిన వాళ్ళవుతారు.

శ్రీవారు

చూడండి.. శ్రీవారు అంటే గౌరవంగా మర్యాదగా మరియు ఆప్యాయంగా ఉందో. ఎంతో గౌరవం ఉంటే మనస్సులో నుండి ఈ మాటలు రావు. కాబట్టి మీ ఆయనను శ్రీవారు అని పిలవండి, ఇలా పిలవడం వలన మీ ఆయనకు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది మరియు  అందరూ కూడా మీ భర్తను చాలా గౌరవంగా పలకరిస్తారు.

బావ..మామ

మన తెలుగువాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే ఇలా బావ, మామ అని పిలుస్తుంటారు. కానీ, ఇలా పిలవటం వలన మనస్సులో నుండే ఆప్యాయంగా పిలిచారు అనే ఫీలింగ్ మగవారికి కలుగుతుంది. ఇలా పిలిచి ఏమైనా చెబితే చాలు, చెప్పు బంగారం అని అడగకుండా ఉండలేరు. నీకోసం ఏమైనా చేస్తాను బంగారం, బుజ్జి అంటూ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. అలాగే మీ వాళ్ళు కూడా ఈ దంపతులు అన్యోన్యంగా ఉన్నారని ఆనందిస్తారు.

పేరు పెట్టి పిలిస్తే..

నిజానికి ప్రస్తుతం దంపతులందరూ తమ భర్తలను ఎక్కువగా పేరు పెట్టే పిలుస్తున్నారు. అలా పిలవటం వలన తప్పేమీ లేదు గానీ అందరూ ముందు ఇలా పిలిస్తే చూడండి, ఈమెకు వీళ్ళ ఆయనపట్ల గౌరవం తక్కువ అని అనుకుంటారు. పేరు పెట్టి లేదా ముద్దుగా అందరి ముందూ కాకుండా మీరు ఇద్దరూ ఉన్నప్పుడే పిలుచుకోండి.

భార్య అంటే భర్తకు గౌరవ, మర్యాదలు కలిగించేలా ఉండాలి, మీ వల్ల మీ ఆయనకు అందరిముందు తలవంచుకునేలా ఉండకూడదు కదా. మహిళలు మీరేమంటారు, నిజమా కాదా.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon