Link copied!
Sign in / Sign up
14
Shares

మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని కలిగించే రంగు ఏంటో తెలుసుకోండి..


రంగు.. సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక్కో ఫేవరెట్ కలర్ ఉంటుంది. తెలుగు లేదా నలుపు రంగులు దుస్తులు ఎక్కువగా ధరించడం,  ఇంట్లో బెడ్ రూమ్ లలో మనసుకు నచ్చిన కలర్స్ అందంగా డెకరోట్ చేసుకోవడం చేస్తుంటారు. మనసుకు నచ్చిన రంగుల వలన పాజిటివ్ గా ఆలోచిస్తారు,  టెన్షన్ దూరమై మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తెలియని ఎనర్జీ వస్తుంది. అలాగే మీ జన్మ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించే రంగు ఏంటో మీరే తెలుసుకోండి..

మేష రాశి

మేష రాశి వారికి కుజుడు అధిపతి. కాబట్టి వీరికి ఎరుపు రంగు మరియు బంగారు వర్ణం రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.  ఇష్టమైన ఈ రంగులు ధరించడం వలన పాజిటివ్ గా ఆలోచిస్తారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వీరికి ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి. అలాగే మరీ ఎక్కువ బ్రైట్ నెస్ ఉండే దుస్తులు కాకుండా లేత రంగులు మరియు తెలుపు, నీలం రంగులు ధరించడం ఉత్తమం.

మిధున రాశి

ఈ రాశి వారికి బుధుడు అధిపతి. వీరు ముదురు రంగులు ధరించకుండా నీలం, పసుపు, ఆకుపచ్చ, పింక్ కలర్స్ అదృష్టాన్ని కలిగిస్తాయి.

కర్కాటకము

కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రుడు తెలుపుకు ప్రతీక కాబట్టి తెలుపు, పసుపు వర్ణం, వైట్ అండ్ సిల్వర్, లేత గోధుమ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

సింహ రాశి

సింహరాశి వారికి సూర్యుడు అధిపతి. పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. వీరికి అదృష్టాన్ని కలిగించే ఈ దుస్తుల వలన నాయకత్వ లక్షణాలు, అధికారాలను సక్రమంగా నిర్వర్తించగలరు. మంచి హృదయం కలిగిన వారు.

కన్య రాశి

ఈ రాశి వారికి గ్రీన్ మరియి బ్రౌన్ కలర్స్ గుడ్ లక్ ను అందిస్తాయి. తెలుపు, ఆకుపచ్చ, బూడిద రంగు దుస్తులు కూడా ధరించవచ్చు. ప్రతి ఒక్కరితో వీరు సహజంగా ఉండగలరు. మనస్సులో ఏమీ దాచుకోకుండా అందరితో పంచుకుంటారు.

తుల రాశి

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. బ్లూ మరియు పింక్ కలర్స్ వీరికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గులాబీ, నీలం రంగు, లేత ఆరంజ్ కలర్స్ వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ కలర్స్ ధరించడం వలన స్థిరంగా ఉండగలరు. మీరు అనుకున్న పనిని ఈజీగా చేయగలరు.

వృశ్చికం

వృశ్చికం రాశి వారికి నలుపు రంగు దుస్తులు అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు జాతక నిపుణులు. గోధుమ, నారింజ, పసుపు, ఎరుపు రంగులు కూడా వీరు ధరించవచ్చు. చేసే పనిలో ఏకాగ్రతను నింపడానికి ఈ కలర్స్ ఈ రాశి వారికి ఉపయోగపడతాయి. మనోధైర్యం కలిగిన వ్యక్తులు కాబట్టి వీరు కలర్స్ గురించి పెద్దగా పట్టించుకోరు.

ధనస్సు

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఊదా రంగు దుస్తులు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. లేత నారింజ, గులాబీ మరియు నీలం, తెలుపు మరియు లేత గోధుమ రంగుల వలన ఉపయోగమే ఉంటుంది.

మకర రాశి

మకర రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి నలుపు రంగు ప్రతీకగా చెబుతారు. వీరికి గ్రే మరియు బ్రౌన్ కలర్స్ అదృష్టాన్ని ఇచ్చే కలర్స్. అలాగే నలుపు, తెలుపు, నీలం రంగులు ధరించవచ్చు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. కుటుంబానికి, స్నేహతులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.

కుంభ రాశి

ఈ రాశి వారికి బ్లూ కలర్స్ అదృష్టాన్ని కలిగించే కలర్స్ అని చెబుతున్నారు ప్రముఖ జాతక నిపుణులు. తెలుపు రంగు, బంగారు వర్ణం, గోధుమ రంగులు కూడా ధరించవచ్చు. తమతో పాటు ఉన్నవారిని ఎప్పుడు నవ్విస్తూ సంతోషంగా ఉంచుతుంటారు. మంచి మనస్సు కలిగినవారు.

మీనము

మీన రాశి వారికి గురువు అధిపతి. లైట్ గ్రీన్ దుస్తులు ధరించడం వలన వీరికి అంతా మంచే జరుగుతుందని సూచిస్తున్నారు. ఎరుపు, పసుపు, ముదురు గోధుమ, తెలుపు రంగు దుస్తులు ధరించవచ్చు. వీరు ధరించే దుస్తులే ఎదుటివాళ్ళు వీళ్ళ గురించి సులువుగా అంచనా వేయగలరు. వారిని బాగా అర్థం చేసుకోగలరు కూడా.

ఇది ప్రముఖులను అడిగిమరీ చెబుతున్నాం. మీకు నచ్చితేనే అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon