Link copied!
Sign in / Sign up
14
Shares

బల్లిశాస్త్రం ప్రకారం బల్లి మన శరీర భాగాలపై పడితే ఏం జరుగుతుంది..! అసలు నిజం వెంటనే తెలుసుకోండి…

బల్లి మీద పడితే అరిష్టం అని, బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి బల్లి పటాన్ని తాకి లేదా దగ్గరలోని గుడికివెళ్లాలని అంటుంటారు మన పెద్దలు. మన ఇళ్లల్లో తిరిగే బల్లి మన శరీర అవయావాల మీద పడితే ఏం జరుగుతుందో వివరంగా ఈ రోజు మీకోసం మేం అందిస్తున్నాం. అసలు నిజం తెలుసుకోండి. ఇది పెద్దలు, పండితులు చెప్పిన విషయాలు కాబట్టి…

బల్లి శరీర అవయవాల మీద పడితే ఏం జరుగుతుందంటే…

ముఖంపై పడితే - డబ్బుల సమస్యలు తొలగి, ఆదాయం వస్తుంది, అలాగే బంధువులు మీ ఇంటికి వస్తారు

కనుబొమ్మల మధ్య - ఎక్కడ, ఏ విషయంలోనైనా సరే మీరు నెట్టుకురాగలరు

మోచేయి మీద - ఆర్ధిక ఇబ్బందులు

ఎడమ చెవిపై - వ్యాపారంలో లాభాలు వస్తాయి

కాలి వేళ్ళపై పడితే - ఆరోగ్య సమస్యలు

అరచేయిపై - డబ్బు లాభం కలుగుతుంది

తల నుదుటిపై - మీ అనుకున్న వారితో గొడవలు, ఇబ్బందులు

కడుపుపై - ధాన్య లాభం కలుగుతుంది

ఎడమ కన్ను - ఏం చేసినా తిరుగుండదు, అంతా మంచే జరుగుతుంది

జుట్టుపై పడితే - ఏదో కీడు జరుగుతున్నట్లు

కన్నులపై - అంతా మంచే జరుగుతుంది

నోటి భాగంలో - మీకు ఇష్టమైన పని వెంటనే చేయగలరు

కుడి వీపుపై - ఏదో తెలియని భయం

చేతి గోర్ల మీద పడితే - డబ్బు నష్టం

భుజం మీద - శుభవార్త వింటారు

ఎద భాగంలో - రావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది

మోకాళ్ళపై - మిమ్మల్ని వెతుక్కుంటూ బంధువులు, స్నేహితులు వస్తారు

పై పెదవిపై - గొడవలు

తొడ భాగంలో - మీకు నచ్చిన వస్తువులు దూరం అవుతాయి

పాదాలపై - ఉన్నట్లుండి ప్రయాణాలు

ఇది మీరు నమ్మాలని, నమ్మకూడదని కాదు గానీ మాకు తెలిసిన సమాచారం  మీకు అందిస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే COMMENT చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon