Link copied!
Sign in / Sign up
13
Shares

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే సంపాదన, సంతోషం నిజంగానే ఉంటుందా..! ఇంట్లో ఎక్కడ పెట్టాలి..?

లాఫింగ్ బుద్ధ గురించి ప్రస్తుత రోజుల్లో తెలియనివారు చాలా తక్కువమందే ఉండవచ్చు. ఐతే ఈ లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం చేయాలి. ఈ విగ్రహాలను ఎక్కడపడితే అక్కడపెట్టడం మంచిది కాదని అంటున్నారు పెంగ్ షూయ్ నిపుణులు. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచాలి? ఎలాంటి  ప్రతిమను ఇంట్లో ఉంచాలో తెలుసుకుందాం…

లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ పెట్టాలి?

⇛సిరి సంపదలకు, శాంతి సంతోషాలకు ప్రతీక అయిన లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని నేలపైన, టీవీలపైనా, బాత్ రూమ్ లలో పెట్టకూడదు. ఇంట్లో, ఆఫీసులలో ఎక్కడపెట్టినా సరే కాస్త ఎత్తైన ప్రదేశాలలో అందరికీ కనిపించేలా ఉంచాలి. మీ ఇంట్లో ఆదాయం బాగా పెరగాలంటే పెరగాలంటే హాల్ లో ఈశాన్య దిశలో ఉంచితే మంచిదని అంటున్నారు.

⇛లాఫింగ్ బుద్ధ నిలబడి ఉన్న ప్రతిమను ఇంట్లో తూర్పు దిశకు అభిముఖంగా ఇంట్లో వారందరికీ కనిపించేలా ఉంచాలి. అదే బెడ్ రూమ్ లేదా హాల్ లో ఐతే పశ్చిమాభిముఖంగా ఉంచాలి. కొన్ని లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ముత్యాలు, రత్నాలతో చేసినవి పిల్లలు చదువుకునే గదిలో ఉంచాలి. ఇలా చేయడం వలన పిల్లలకు చదువు బాగా అబ్బడమే కాకుండా చురుకుగా ఉంటారు.

ఆఫీస్ వర్క్ టెన్షన్స్ ఎదుర్కుంటున్న వారు నవ్వుతు నిలబడి ఉన్న ప్రతిమను ఆఫీసులో ఎదురుగా ఉంచుకుంటే  స్ట్రెస్ తగ్గుతుంది అలాగే అందరితో సరదాగా ఉంటారు.

⇛లాఫింగ్ బుద్ధ ప్రతిమను ఇంట్లో సూర్య కిరణాలూ పడే చోట ఉంచడం వలన అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. ఒకరికొకరికి గొడవలు రాకుండా, ప్రేమగా అన్యోన్యంగా ఉండాలంటే దంపతులకు లేదా ప్రేమికులకు లాఫింగ్ బుద్ధను గిఫ్ట్ ఇవ్వడం మంచిదని చెబుతున్నారు.

ఎలాంటి లాఫింగ్ బుద్ధ ఉంటే ఏం జరుగుతుంది..?

⇛లాఫింగ్ బుద్ధ ప్రతిమలు అన్నీ ఒకే విధంగా ఉండవు. అలాంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాలలో 5 మంది పిల్లలతో కలిసి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉండటం వలన ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందట.

⇛చేతిలో విసనకర్రతో ఉండే లాఫింగ్ బుద్ధ ఉండటం వలన సమస్యలు తొలగిపోతాయని, లాఫింగ్ బుద్ధ కూర్చుని ఉంటే మనుషుల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందని, చేతిలో ఒక పాత్రను పట్టుకుని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఉంటారని అంటున్నారు.

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే మంచిది అని మీకు అనిపిస్తే ‘అవును’ అని, మంచిదికాదనిపిస్తే ‘కాదు’ అని కామెంట్ చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon