Link copied!
Sign in / Sign up
22
Shares

కృష్ణాష్టమి రోజున ఈ కథను తెలుసుకుంటే లేదా వింటే సకల ఐశ్వర్యాలు మీ వెంట వస్తాయి


కృష్ణాష్టమి రోజు ఈ కథ తెలుసుకొని, భక్తి శ్రద్దలతో శ్రీ కృష్ణుడిని పూజిస్తే మీ కోరికలు నిరవేరి, సకల ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి. శ్రీ విష్ణవు ధరించిన అవతారాలలో 8వ అవతారం, పూర్ణావతారమైన అవతారం శ్రీ కృష్ణావతారం. ఈ అవతారంలోనే భగవంతుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భగవద్గీతను భోదించదు. మనిషి ఎలా బ్రతకాలో తెలిపిన మహా గ్రంధం అతని చరిత్ర, దృష్ట్యా శిక్షణ శిష్ట రక్షణ అతని నీతి . న్యాయానికి అండగా ఉంటూ అన్యాయాన్ని నిర్మూలించి భూలోకంలో ఎన్నో మహిమల్ని చాటిన శ్రీ కృష్ణుడు గురించి ఎంత విన్నా వింటూనే ఉండాలనిపిస్తుంది.

ఈ రోజు శ్రీ కృష్ణజన్మష్టమి కావు ఆయన జనన వృతాంతాన్ని, ఆయన లీలలను తెలుసుకుందాము. ద్వాపర యుగంలో అధర్మం శృతిమించిడంతో బ్రహ్మ దేవుడు మరియు భూదేవి శ్రీ మహావిష్ణువుని భూలోకంలో చెడుని సంహరించి మనుషులను సన్మార్గంలో నడిపించమని వేడుకుంటారు. వారి కోరికను అంగీకరిస్తూ మహా విష్ణువు దేవకీ వసుదేవులకు బిడ్డగా జన్మిస్తాడు. కానీ, కంసుడి కారణంగా, వసుదేవుడి సహాయంతో కృష్ణుడు యశోద బిడ్డగా గోకులంలో పెరుగుతాడు. చిన్న తనంలో చిలిపి చేష్టలు చేస్తూ ఎన్నో లీలలు ప్రదర్శిస్తాడు. బాల్యం ఎంత గొప్పదో తెలియ చేస్తూ జ్ఞానం అంటే కేవలం చదువుకోవడమే కాదు, ఆటలు పాటలు అన్ని కలిపితేనే జ్ఞానం అని బోధిస్తాడు. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి అని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడడం ద్వారా తెలియజేసాడు. కష్టాలలో కూడా నవ్వుతూ మన పని చేస్తే సంతోషం తధ్యమని విషసర్పంని చంపడం ద్వారా తెలియజేసాడు. ఇలా తన లీలతో అందరిని ఆకట్టుకుంటున్న సమయంలో తన జనన రహస్యం తెలుసుకొని ప్రజలను హింసిస్తున్న కంసుడిని చంపి రాజు అవుతాడు. తరువాత కూరుఖ్స్త్రానికి దారి వేసి, అందరు చనిపోయేలా చేశాడు. భావి తరాల వారు ఆ యుగంలో చేసిన తప్పులు చేయకుండా సుఖ సంతోషాలతో బ్రతికేలా భగవద్గీతను బోధించాడు. ప్రయత్నించాను ఫలితం ఆశించకు అనేది మనం వింటూనే ఉంటాం కానీ అది ఎంత విలువైన మాట అనేది దానిని ఆచరిస్తే కానీ తెలీదు. ఒక్క సారి ఆచరించండి, మీ జీవితం ఎంత మధురంగా మారుతుందో మీరే చూడండి.

నిజమైన పూజ చేయడం అంటే వారి మాటలను ఆచరించడమే. మన మంచికే చెప్పిన మాటలు మనం ఎందుకు ఆచరించకూడదు? భగవద్గీత చదవండి, ఆచరించండి, అలరించనుంది, సంతోషంగా జీవించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon